కేటీఆర్‌పై కేసు పెట్టాలి : వీహెచ్
దిశ, న్యూస్‌బ్యూరో : కంటైన్‌మెంట్ ఏరియాలో 15 మందితో తిరిగిన మంత్రి కేటీఆర్‌పై కేసు ఎందుకు పెట్టలేదని పోలీసు అధికారులను మాజీ ఎంపీ వి. హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణపై ప్రతిపక్షాలు ఇచ్చే సూచలను పాటించడం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఒంటరిగా […]
దిశ, న్యూస్‌బ్యూరో : కంటైన్‌మెంట్ ఏరియాలో 15 మందితో తిరిగిన మంత్రి కేటీఆర్‌పై కేసు ఎందుకు పెట్టలేదని పోలీసు అధికారులను మాజీ ఎంపీ వి. హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణపై ప్రతిపక్షాలు ఇచ్చే సూచలను పాటించడం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఒంటరిగా పూలమాల వేయడానికి వెళితే తమపై కేసు నమోదు చేశారని, బుధవారం మంత్రి కేటీఆర్ వేములవాడలో 15 మంది కార్యకర్తలతో కంటైన్‌మెంట్‌గా గుర్తించిన ఏరియాలో తిరిగితే తనపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి కేటీఆర్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తమపై పోలీసులు పెట్టిన కేసులపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
Tags : KTR, V, Hanumantha Rao, Police case, Continement Zone, HRC