గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలి ఎర్త్‌క్వేక్ అలెర్ట్ యాప్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా భూకంపం సంభవించడానికి ముందు అప్రమత్తం చేసే యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ పేరు ‘ఉత్తరాఖండ్ భూకంప్ అలెర్ట్’. దీనిని రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ దామి బుధవారం ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫార్మ్‌లకు అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూక్రే అభివృద్ధి చేశాయి. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారికి భూకంపం సంభవించడానికి ముందే హెచ్చరికలు అందుతాయి. అంతేకాకుండా భూకంపం ప్రభావిత […]
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా భూకంపం సంభవించడానికి ముందు అప్రమత్తం చేసే యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ పేరు ‘ఉత్తరాఖండ్ భూకంప్ అలెర్ట్’. దీనిని రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ దామి బుధవారం ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫార్మ్‌లకు అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూక్రే అభివృద్ధి చేశాయి. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారికి భూకంపం సంభవించడానికి ముందే హెచ్చరికలు అందుతాయి. అంతేకాకుండా భూకంపం ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్నవారిని ట్రేస్ చేయడానికి విపత్తు నిర్వహణ అధికారులకు దోహదపడుతుంది. యాప్‌ను ఆవిష్కరించిన సందర్భంగా సీఎం దామి మాట్లాడుతూ.. భూకంపాలు సంభవించే ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు చేపట్టడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో మరిన్ని ఫీచర్స్ తీసుకురావాలని, స్మార్ట్‌ఫోన్ లేనివారినీ అప్రమత్తం చేసేలా అభివృద్ధి చేయాలని సూచించారు.