మత కార్యక్రమాలకు అనుమతి లేదు : యోగి
లక్నో: దేశ వ్యప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిథ్య నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 తేదీ వరకూ ఎలాంటి సామాజిక, మత కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ(హోం) అవనీష్ కుమార్ అవస్థీ మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం […]
లక్నో: దేశ వ్యప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిథ్య నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 తేదీ వరకూ ఎలాంటి సామాజిక, మత కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు.
అడిషనల్ చీఫ్ సెక్రటరీ(హోం) అవనీష్ కుమార్ అవస్థీ మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం యోగీ ఆదేశించారని అన్నారు. శనివారం, ఆదివారం మార్కెట్లను మూసివేయడంతో పాటు ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినటట్టు అవస్థీ తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి పోలీసులు మార్చి చివరివారం నుంచి ఇప్పటివరకు రూ.70 కోట్లు వసూలు చేసినట్టు వెల్లడించారు.