వాయుకాలుష్యాన్ని పెంచిన క్రాకర్స్

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ నగరంతో పోలిస్తే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కొంత తక్కువే అయినా దీపావళి పండుగ రోజున (శనివారం) సాయంత్రం ఆరున్నర గంటల నుంచే వాతావరణంలో మార్పు మొదలైంది. అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకూ కాలుష్యం తీవ్ర స్థాయిలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోజువారీ నమోదవుతున్న సగటు వాయు కాలుష్యంతో పోలిస్తే టపాసులు పేల్చిన తర్వాత రెండున్నర రెట్ల మేర నాణ్యతలో మార్పు వచ్చినట్లు తేలింది. శనివారం సాయంత్రం ఏడున్నర గంటల సమయానికి ప్రతీ ఘనపు […]

Update: 2020-11-15 11:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ నగరంతో పోలిస్తే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కొంత తక్కువే అయినా దీపావళి పండుగ రోజున (శనివారం) సాయంత్రం ఆరున్నర గంటల నుంచే వాతావరణంలో మార్పు మొదలైంది. అర్ధరాత్రి ఒంటిగంటన్నర వరకూ కాలుష్యం తీవ్ర స్థాయిలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోజువారీ నమోదవుతున్న సగటు వాయు కాలుష్యంతో పోలిస్తే టపాసులు పేల్చిన తర్వాత రెండున్నర రెట్ల మేర నాణ్యతలో మార్పు వచ్చినట్లు తేలింది. శనివారం సాయంత్రం ఏడున్నర గంటల సమయానికి ప్రతీ ఘనపు మీటరు గాలిలో కేవలం 123 మైక్రో గ్రాముల మేర మాత్రమే కాలుష్యం ఉండగా (గాలిలో నాణ్యత ఇండెక్స్ ప్రమాణాల కొలతల ప్రకారం) ఆ తర్వాత గంటసేపటికే (రాత్రి 8.30 గంటలకు) ఏకంగా 303 మైక్రో గ్రాములకు పెరిగింది. రాత్రి 9.30 గంటలకు 349మైక్రో గ్రాములకు, 10.30 గంటలకు 381 మైక్రో గ్రాములకు పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గింది. నగరంలో ఎక్కువ కాలుష్యం నమోదయ్యే సనత్‌నగర్ ప్రాంతం సహా జూపార్కు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ లాంటి అనేక ప్రాంతాల నుంచి సేకరించిన గణాంకాలను సగటుగా తీసుకుని లెక్కించింది ఓ స్వతంత్ర పర్యావరణ సంస్థ.

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నగరంలో రాత్రి 8.00 గంటల నుంచి 10.00 గంటల మధ్యలో మాత్రమే టపాసులను పేల్చాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం రాత్రి 8.00 గంటల నుంచే బాణసంచా కాల్చడం మొదలైంది. రాత్రి 10 గంటలకల్లా ముగించాల్సి ఉన్నప్పటికీ అదనంగా గంట సేపటిదాకా ప్రజలు కాలుస్తూనే ఉన్నారు. దీంతో రాత్రి 11.00 గంటల సమయానికి కూడా గరిష్ట స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ ప్రమాదకర స్థాయిలోనే కొనసాగింది. రాత్రి 11.30 గంటలకు 347 మైక్రోగ్రాముల నుంచి తెల్లవారుజాము తర్వాత తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయానికి కేవలం 77 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఆదివారం సెలవుదినం కావడంతో వాహనాల కాలుష్యం కూడా పెద్దగా లేనందున మధ్యాహ్నం 11.30 గంటల సమయానికి కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 146 దాటలేదు.

దీపావళి బాణసంచాకు ప్రభుత్వం రెండు గంటల సమయాన్ని మాత్రమే కేటాయించిన కాలుష్యం మాత్రం దాదాపు ఐదు గంటలకు పైగా కొనసాగింది. ఒకవేళ న్యాయస్థానాల ఆంక్షలే లేకపోయినట్లయితే రెండు రోజుల పాటు ఆ ప్రభావం కొనసాగే అవకాశం ఉండేది.

Tags:    

Similar News