శునకాలకు బీర్.. చీఫ్ టేస్టింగ్ ఆఫీసర్‌‌‌ కావాలంటూ యాడ్

దిశ, ఫీచర్స్ : మనుషులకు కిక్కిచ్చే బీర్ల గురించి అందరికీ తెలుసు కానీ శునకాల కోసం కూడా బీర్లు ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. ఈ క్రమంలో యూఎస్ బీర్ కంపెనీ బుష్.. గతేడాది కుక్కల కోసం ‘డాగ్ బ్రూ’‌ పేరుతో ఓ ప్రత్యేక పానీయాన్ని మార్కెట్‌లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఆ కంపెనీ, తమకు ‘చీఫ్ టేస్టింగ్ ఆఫీసర్’ కావాలంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. ఇందుకోసం గ్రామ సింహాలకు ఒక పోటీని నిర్వహించనుండగా.. […]

Update: 2021-04-19 03:26 GMT

దిశ, ఫీచర్స్ : మనుషులకు కిక్కిచ్చే బీర్ల గురించి అందరికీ తెలుసు కానీ శునకాల కోసం కూడా బీర్లు ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. ఈ క్రమంలో యూఎస్ బీర్ కంపెనీ బుష్.. గతేడాది కుక్కల కోసం ‘డాగ్ బ్రూ’‌ పేరుతో ఓ ప్రత్యేక పానీయాన్ని మార్కెట్‌లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఆ కంపెనీ, తమకు ‘చీఫ్ టేస్టింగ్ ఆఫీసర్’ కావాలంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. ఇందుకోసం గ్రామ సింహాలకు ఒక పోటీని నిర్వహించనుండగా.. ఈ మేరకు అప్లికేషన్స్ కోరుతోంది బుష్ కంపెనీ.

కాఫీ, చాక్లెట్, బిస్కెట్, బీర్ తదితర కంపెనీల్లో ‘టేస్టింగ్ ఆఫీసర్స్’ పాత్ర కీలకం. టేస్ట్ కాస్త అటు ఇటు అయితే కస్టమర్ల నుంచి బ్యాడ్ రివ్యూస్ రావడమే కాకుండా, కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినే ప్రమాదముంది. అందుకే సూపర్ ‘టేస్టర్స్’‌కు లక్షల్లో జీతం ఇవ్వడానికి కంపెనీలు ముందుకొస్తుంటాయి. ఇక కుక్కల కోసం బుష్ కంపెనీ తయారు చేస్తున్న ‘డాగ్ బ్రూ’ బీర్ కోసం టేస్టింగ్ ఆఫీసర్‌ కావాలంటూ యాడ్ ఇవ్వగా, ఈ జాబ్ కోసం ఎంపికైన శునకానికి 20 వేల డాలర్ల జీతం, జీవిత భీమాతో పాటు ఉచితంగా డాగ్ బ్రూ బీర్‌‌ను అందించనుంది. అంతేకాదు ఈ బీర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఆ శునకమే వ్యవహరించనుంది. కాగా ఈ పోటీకి పంపించే శునకాలకు సంబంధించిన అందమైన చిత్రాలను వాటి యజమానే కంపెనీకి పంపించడంతో పాటు ఈ జాబ్‌కు ఆ శునకం ఏ విధంగా సూట్ అవుతుందో కూడా వివరించాలి. ఈ కాంటెస్ట్‌కు ఏప్రిల్ 28 తేదీలోపు డీటెయిల్స్ పంపించాల్సి ఉండగా.. సృజనాత్మకత, యూనిక్‌నెస్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఫైనల్‌గా ఈ నెల చివరన కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను ప్రకటిస్తారు.

‘దేశంలోని శునకాల కోసం ఉత్తమమైన పానీయాన్ని రూపొందించేందుకు ‘చీఫ్ టెస్టింగ్ ఆఫీసర్’ సాయం చేస్తాడు. ఈ ఉద్యోగానికి పర్‌ఫెక్ట్ చాయిస్ కోసం దేశవ్యాప్తంగా పోటీని ప్రారంభించాం. తాము అందించే ది బెస్ట్ రుచిని కాపాడుకోవడంతో పాటు కొత్త రుచులను పరిశోధించడం, పెట్ ప్రాజెక్టులను చేపట్టడం మా ఏకైక బాధ్యత. యువర్ బార్క్ విల్ హావ్ టు బి యాజ్ గుడ్ యాజ్ యువర్ బైట్’ అంటూ బుష్ కంపెనీ యాడ్‌లో వెల్లడించింది.

Tags:    

Similar News