మహిళల కోసం పర్సనల్ ‘సేఫ్టీ’ యాప్
దిశ, ఫీచర్స్ : ఆఫీస్ వర్క్ ముగించుకొని.. లేట్ నైట్ క్యాబ్‌లో ఇంటికి వెళ్లే మహిళలకు సదరు క్యాబ్ డ్రైవర్ కరెక్ట్‌గా తీసుకెళ్తాడా? లేదా.. అనే టెన్షన్ ఇల్లు చేరే వరకు ఉంటుంది. రోజువారీ జీవితంలో దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలు.. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంటి దగ్గర, వీధుల్లో, పని ప్రదేశాల్లో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించేటపుడు ఎక్కడో చోట మహిళలు తరచూ వేధింపులకు గురౌతున్నారు. ఈ క్రమంలో ఇండియాలో ప్రతీ 15 నిమిషాలకు ఒక […]
దిశ, ఫీచర్స్ : ఆఫీస్ వర్క్ ముగించుకొని.. లేట్ నైట్ క్యాబ్‌లో ఇంటికి వెళ్లే మహిళలకు సదరు క్యాబ్ డ్రైవర్ కరెక్ట్‌గా తీసుకెళ్తాడా? లేదా.. అనే టెన్షన్ ఇల్లు చేరే వరకు ఉంటుంది. రోజువారీ జీవితంలో దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలు.. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంటి దగ్గర, వీధుల్లో, పని ప్రదేశాల్లో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించేటపుడు ఎక్కడో చోట మహిళలు తరచూ వేధింపులకు గురౌతున్నారు. ఈ క్రమంలో ఇండియాలో ప్రతీ 15 నిమిషాలకు ఒక రేప్ జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్తగా పర్సనల్ సేఫ్టీ యాప్ రూపొందించబడింది. ఈ యాప్.. ఆపదలో చిక్కుకున్న వ్యక్తుల వాయిస్ కమాండ్ ద్వారా వారి లైవ్ లొకేషన్‌తో SOS అలర్ట్‌ను కుటుంబ సభ్యులకు పంపిస్తుంది. ‘సాహాస్’ పేరుతో రిలీజైన ఈ యాప్‌ను యూఎస్‌కు చెందిన టెకీ కపుల్ రూపొందించారు.
2020లో ప్రారంభించబడిన సాహాస్.. మహిళలతో పాటు ప్రమాదంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ లేదా ఎల్‌జీబీటీక్యూ తదితర కమ్యూనిటీలకు రక్షణ కల్పించడంలోనూ వేగంగా స్పందిస్తుంది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా యూజర్ కేవలం ఒక్క క్లిక్‌తో ఫేక్ ఫోన్ కాల్ ఫీచర్ ఉపయోగించి లేదంటే తమ సన్నిహితులకు మెసేజ్ పంపడం ద్వారా విపత్కర పరిస్థితుల నుంచి సేఫ్‌గా బయటపడొచ్చు. కాగా ఈ ఇన్నోవేషన్ వెనకున్న కారణాన్ని యాప్ ఫౌండర్ నీలాంజన్ వెల్లడించారు. ‘2012 నిర్భయ ఘటన తర్వాత నుంచి ఈ ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టాం.
ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులకు శిక్షలు కూడా పడ్డాయి. అయినా ఇండియాలో ఇలాంటి కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడం పబ్లిక్ సేఫ్టీ విషయంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత 2019లో హైదరాబాద్‌లో జరిగిన గ్యాంగ్ రేప్‌లోనూ ఇదే విషయం స్పష్టమైంది. దీనికి సొల్యూషన్ కనుగొనే క్రమంలోనే నేను, నా భార్య శ్రేయ కలిసి ‘సాహాస్’ యాప్‌ను డిజైన్ చేశాం’ అని నీలాంజన్ తెలిపారు.
ఎలా పనిచేస్తుంది?
ఇది రెండు కేటగిరీల్లో(ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్) పనిచేస్తుంది. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనపుడు యూజర్ వెంటనే ఈ రెండు అలర్ట్స్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్టయితే.. హెల్ప్ కోసం వారిని స్పెసిఫిక్ నెట్‌వర్క్‌లోని ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌కు ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేస్తుంది. పరిస్థితులు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నట్టు భావిస్తే, ఆరెంజ్ అలర్ట్‌ను సెండ్ చేయవచ్చు. ఇది నేరుగా ‘హార్ట్ సర్కిల్- క్లోజ్ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్’ ఉన్న వ్యక్తులకు చేరుతుంది. అలర్ట్ ఒక్కసారి యాక్టివేట్ అయితే, యూజర్ లైవ్ లొకేషన్‌తో పాటు ఇతరత్రా క్రిటికల్ ఇన్‌ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు ఆ నెట్‌వర్క్ వ్యక్తులతో చాట్ కూడా చేయొచ్చు.
ఈ అప్లికేషన్‌కు సంబంధించిన సేఫ్టీ ఫీచర్లు అన్నింటినీ మంత్లీ లేదా సంవత్సర ప్లాన్(నెలకు రూ.199)పై పొందవచ్చు. అంతేకాదు కొత్త యూజర్లకు 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో దీన్ని మరిన్ని ఫీచర్స్‌తో డెవలప్ చేయనున్నట్టు ఫౌండర్ నీలాంజన్ తెలపడం విశేషం. కాగా ఈ అప్లికేషన్ పొందాలంటే ప్లే స్టోర్, ఐవోఎస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.