సముద్రమంత ప్రేమతో నిండిన ‘ఉప్పెన’
దిశ, సినిమా : పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ‘ఉప్పెన’ టీజర్.. సముద్రమంత ప్రేమతో నిండిపోయింది. ప్రేమంటే ఓ లైలా- మజ్ను, దేవదాసు – పార్వతి, రోమియో – జూలియట్‌లా ఉండాలని కోరుకునే పేదింటికి చెందిన హీరో.. పెద్దింటికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడుతాడు. కానీ అమ్మాయిని పరువుగా భావించే తండ్రి, ఆ పరువును సాయంత్రం కల్లా ఇంటికి చేర్చే కొడుకును విలన్(విజయ్ సేతుపతి)గా నిలబెట్టాడు. ‘సముద్రం, ఆకాశం కలవవు.. అలలెంత ఎగిసిసడినా ఆకాశాన్ని […]
దిశ, సినిమా : పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ‘ఉప్పెన’ టీజర్.. సముద్రమంత ప్రేమతో నిండిపోయింది. ప్రేమంటే ఓ లైలా- మజ్ను, దేవదాసు – పార్వతి, రోమియో – జూలియట్‌లా ఉండాలని కోరుకునే పేదింటికి చెందిన హీరో.. పెద్దింటికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడుతాడు. కానీ అమ్మాయిని పరువుగా భావించే తండ్రి, ఆ పరువును సాయంత్రం కల్లా ఇంటికి చేర్చే కొడుకును విలన్(విజయ్ సేతుపతి)గా నిలబెట్టాడు. ‘సముద్రం, ఆకాశం కలవవు.. అలలెంత ఎగిసిసడినా ఆకాశాన్ని అందుకోలేవు.. కానీ ఆ ఆకాశం వంగితే.. కలుస్తాయి కదా’ ఇక్కడ అదే జరిగింది.
అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడ్డాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెద్దలు ఒప్పుకోవడం లేదు కాబట్టి పారిపోవాలి అనుకుంటారు. అలాంటి ప్రేమ గొప్పదే కదా. మరి ‘ప్రేమ గొప్పదైతే చరిత్రలోనో, సమాధుల్లోనో కనబడాలి కానీ.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇండ్లలో కనబడితే విలువ తగ్గిపోతుంది కదా.. అందుకే ప్రేమెప్పుడూ చరిత్రలోనే ఉండాలి.. దానికి భవిష్యత్ ఉండకూడదు’ అంటూ హీరోను హతం చేసేందుకు ప్రయత్నిస్తాడు విలన్. ఇంతకీ ‘ఉప్పెన’ అంత ఈ ప్రేమ సుఖాంతమేనా? విషాదాంతమా? అనేది థియేటర్స్‌లో చూసి తెలుసుకోవాల్సిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్ అద్భుతంగా ఉండగా.. విజయ్ సేతుపతి నటనకు ప్రశంసలు అందుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా ఫిబ్రవరి 12న విడుదల కాబోతోంది.