వారికి వందల కోట్లు ఇచ్చిన బెజోస్.. ఎందుకంటే..?
దిశ, ఫీచర్స్ : ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తిచేసి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. ఈ సంతోష సమయంలో ఆయన ‘కరేజ్ అండ్ సివిలిటీ’ అవార్డును ప్రకటించాడు. గొప్ప మానవాతవాదిగా గుర్తింపు తెచ్చుకున్న చెఫ్ జోస్ ఆండ్రెస్‌తో పాటు, రాజకీయ వ్యాఖ్యాత, డ్రీమ్ కార్ప్స్ వ్యవస్థాపకుడు వాన్ జోన్స్‌లకు ఈ పురస్కారంతో పాటు క్యాష్‌ప్రైజ్ అందించాడు. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి […]
దిశ, ఫీచర్స్ : ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తిచేసి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. ఈ సంతోష సమయంలో ఆయన ‘కరేజ్ అండ్ సివిలిటీ’ అవార్డును ప్రకటించాడు. గొప్ప మానవాతవాదిగా గుర్తింపు తెచ్చుకున్న చెఫ్ జోస్ ఆండ్రెస్‌తో పాటు, రాజకీయ వ్యాఖ్యాత, డ్రీమ్ కార్ప్స్ వ్యవస్థాపకుడు వాన్ జోన్స్‌లకు ఈ పురస్కారంతో పాటు క్యాష్‌ప్రైజ్ అందించాడు.
సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి ‘కరేజ్ అండ్ సివిలిటీ’ అవార్డుతో సత్కరిస్తారు. ఇందులో భాగంగా 100మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 735 కోట్లు) నగదు బహుమతి కూడా అందిస్తారు. ఇక తొలిగా చెఫ్ జోస్ ఆండ్రెస్, వాన్ జోన్స్‌లు కరేజ్ అండ్ సివిలిటీ అవార్డును అందించాడు. 2010లో స్థాపించిన ఎన్‌జీవో ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ ఆలోచనలో ఆండ్రెస్ కూడా ఒకడు. ప్రపంచవ్యాప్తంగా తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయా ప్రాంతాల్లోని బాధితులకు ఆహారం ఇచ్చే కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేస్తుంది. ‘సెంట్రల్ కిచెన్ మరింత విస్తరించేందుకు ఈ డబ్బును ఉపయోగిస్తాను. ఈ అవార్డు ఒక్కటే ప్రపంచానికి ఆహారం అందించలేదు. కానీ మేము ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్ళను దాటి ఆలోచించటానికి ఇటువంటి అవార్డులు సహాయం చేస్తాయి’ అని ఆండ్రెస్ వివరించాడు.
‘ఆండ్రెస్, జోన్స్‌లు ఇద్దరూ కూడా రోల్ మోడల్స్. వాళ్ల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. అవార్డు గెలుచుకున్న డబ్బుని వాళ్లు తమ సొంత చారిటీ సంస్థలకు డొనేట్ చేయొచ్చు లేదా ఇతరులకు పంచవచ్చు. అది వారిష్టం’ అని జెఫ్ బెజోస్ చెప్పుకొచ్చారు.