యోగాతో ఒత్తిడి అధిగమిద్దాం : ఉపాసన
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల… సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంటారు. ప్రకృతి, జంతుజాలాన్ని కాపాడుకునేందుకు మానవులుగా మనం ఏం చేయాలనేదానిపై క్యాంపెయిన్ చేసిన ఉపాసన మంచి పేరు తెచ్చుకున్నారు. భర్త రామ్ చరణ్‌ను కూడా అటు వైపుగా ప్రోత్సహించి వైల్డ్ ఫోటోగ్రాఫర్‌గాను మార్చారు. ఇంట్లోనే ఈ ఫోటోలు ప్రదర్శించి జంతువులు, పశు పక్ష్యాదులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అడవుల పరిరక్షణపై కూడా క్యాంపెయినింగ్ చేస్తున్న ఉపాసన.. […]
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల… సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంటారు. ప్రకృతి, జంతుజాలాన్ని కాపాడుకునేందుకు మానవులుగా మనం ఏం చేయాలనేదానిపై క్యాంపెయిన్ చేసిన ఉపాసన మంచి పేరు తెచ్చుకున్నారు. భర్త రామ్ చరణ్‌ను కూడా అటు వైపుగా ప్రోత్సహించి వైల్డ్ ఫోటోగ్రాఫర్‌గాను మార్చారు. ఇంట్లోనే ఈ ఫోటోలు ప్రదర్శించి జంతువులు, పశు పక్ష్యాదులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అడవుల పరిరక్షణపై కూడా క్యాంపెయినింగ్ చేస్తున్న ఉపాసన.. యోగా ద్వారా మనుషులకు కలిగే లాభాలను వివరిస్తున్నారు.
హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ నేతృత్వంలో పోలీసుల కోసం నిర్వహించిన యోగా క్యాంప్‌లో ఆమె పాల్గొన్నారు. పోలీసుల శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విధుల నిర్వహణలో పోలీసులకు మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా ఒత్తిడి ఉంటుందని.. యోగా ద్వారా వాటన్నింటిని అధిగమించవచ్చని సూచించారు. మనల్ని రక్షించేందుకు 24 గంటలు శ్రమిస్తున్న పోలీసులకు మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రతీ ఒక్కరు కూడా యోగా, ఎక్సర్సైజ్ చేయాలని తద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రావాలని కాంక్షించారు. సీపీ అంజనీ కుమార్ హయాంలో ఆరోగ్యమైన పోలీసు బలగం తయారవుతుందని నమ్ముతున్నానని తెలిపారు.