ఆరుగురు 'తబ్లిగీ' సభ్యులపై ఎన్ఎస్ఏ
లక్నో: వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ సభ్యులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దేశ భద్రత చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం కింద ఎటువంటి అభియోగాలు మోపకుండానే ఏడాదిపాటు నిర్బంధించో అవకాశముంటుంది. కరోనా వైరస్ చెకప్ కోసం ఈ ఆరుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గజియాబాద్ లో ఎంఎంజి జిల్లా ఆసుపత్రిలో నర్సులతో ఆ ఆరుగురు తప్పుగా వ్యవహరించాలని ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర సీఎం […]
లక్నో: వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ సభ్యులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దేశ భద్రత చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం కింద ఎటువంటి అభియోగాలు మోపకుండానే ఏడాదిపాటు నిర్బంధించో అవకాశముంటుంది. కరోనా వైరస్ చెకప్ కోసం ఈ ఆరుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గజియాబాద్ లో ఎంఎంజి జిల్లా ఆసుపత్రిలో నర్సులతో ఆ ఆరుగురు తప్పుగా వ్యవహరించాలని ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అటువంటి వారిని క్షమించరాదని, డ్యూటీలోని మహిళా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం నేరమని పేర్కొన్నారు. వారిపై దేశ భద్రత చట్టాన్ని ప్రయోగించేందుకు ఆదేశించినట్లు తెలిపారు.
Tags: NSA, Tablighi jamaat, UP govt, slapped, yogi adityanath