అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి

దిశ, తెలంగాణ బ్యూరో : అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వర్కింగ్ పీపుల్స్ చార్టర్ జాతీయ కోఆర్డినేటర్ చందన్ కుమార్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి వర్కింగ్ పీపుల్స్ చార్టర్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. అసంఘటిత కార్మికులను కార్మికశాఖ గుర్తించడంతో పాటు వారికి బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చందన్ కుమార్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేసే చాలా మంది కార్మికులు, అధికారిక రంగంలో […]

Update: 2021-08-20 08:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అసంఘటిత రంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వర్కింగ్ పీపుల్స్ చార్టర్ జాతీయ కోఆర్డినేటర్ చందన్ కుమార్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి వర్కింగ్ పీపుల్స్ చార్టర్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. అసంఘటిత కార్మికులను కార్మికశాఖ గుర్తించడంతో పాటు వారికి బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా చందన్ కుమార్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేసే చాలా మంది కార్మికులు, అధికారిక రంగంలో అనధికారికంగా పనిచేస్తున్న వారిని కూడా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. వారికి సహాయం అందజేసేందుకే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూపీసీ జాతీయ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ షేక్ సల్లావుద్దీన్, ఇండియా లేబర్‌లైన్ స్టేట్ కోఆర్డినేటర్ అంజిరెడ్డి, గృహకార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ సిస్టర్ జెనస్టస్, మోంట్‌ఫోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు ఉన్నారు.

Tags:    

Similar News