మార్కెట్లోకి యునిసెక్స్ హిజాబ్!

దిశ, ఫీచర్స్ : ఆడుకునే బొమ్మల నుంచి వేసుకునే దుస్తుల వరకు స్త్రీ, పురుష బేధాలు ప్రతిబింబిస్తూనే ఉంటాయి. ఇటీవల కాలంలో ఆ వ్యత్యాసం ఇతరత్రా పనులు, వస్తువుల్లోనూ కనిపిస్తోంది. ఈ బేధాన్ని ఎలాగైనా అంతమొందించాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా అనేక కంపెనీలు ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో మేల్, ఫిమేల్ ఇద్దరూ వాడుకునే ‘యునిసెక్స్ ప్రొడక్ట్స్’‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘యునిసెక్స్ కండోమ్స్’ మార్కెట్‌లో విడుదలవగా, తాజాగా ‘యునిసెక్స్ హిజాబ్’ తెరపైకి […]

Update: 2021-11-11 03:28 GMT

దిశ, ఫీచర్స్ : ఆడుకునే బొమ్మల నుంచి వేసుకునే దుస్తుల వరకు స్త్రీ, పురుష బేధాలు ప్రతిబింబిస్తూనే ఉంటాయి. ఇటీవల కాలంలో ఆ వ్యత్యాసం ఇతరత్రా పనులు, వస్తువుల్లోనూ కనిపిస్తోంది. ఈ బేధాన్ని ఎలాగైనా అంతమొందించాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా అనేక కంపెనీలు ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో మేల్, ఫిమేల్ ఇద్దరూ వాడుకునే ‘యునిసెక్స్ ప్రొడక్ట్స్’‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘యునిసెక్స్ కండోమ్స్’ మార్కెట్‌లో విడుదలవగా, తాజాగా ‘యునిసెక్స్ హిజాబ్’ తెరపైకి వచ్చింది. ఫ్యాషన్ బ్రాండ్ ‘యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్’.. సంప్రదాయ ఇస్లామిక్ హెడ్‌వేర్ కొత్త శ్రేణిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్ట్రెచ్ ఫాబ్రిక్‌లో యునిసెక్స్ హిజాబ్ రూపొందించగా.. ఈ హెడ్‌వేర్‌ను పురుషులతో పాటు మహిళలు కూడా ధరించవచ్చు. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో తయారైన వీటి ధర రూ.3,009 (£29.95 ). ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మహిళలు హిజాబ్‌ ధరించడం ఆనవాయితీగా వస్తోంది. తల, మెడను కప్పి ఉంచే వస్త్రంలో స్త్రీ ముఖం మాత్రమే కనిపిస్తుంది. ఆచారాలు, విశ్వాసాల ఆధారంగా నిర్ణయించిన ఈ సంప్రదాయక వేషధారణలో మహిళలు తమ జుట్టును పూర్తిగా కప్పుకోవాల్సి ఉంటుంది. కొందరి దృష్టిలో ఇది చాందసవాదానికి ప్రతీక కాగా.. మరికొందరి దృష్టిలో అస్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి సంకేతం. అయితే ఇది ధరించడం, ధరించకపోవడం ఆయా వ్యక్తుల నమ్మకం, విశ్వాసంతో పాటు మతాచారంపై ఆధారపడి ఉంటుంది.

అయితే ఈ యునిసెక్స్ హిజాబ్‌ వస్త్రాన్ని పురుషులు కూడా కప్పుకోవచ్చు. ఈ ఏడాది ‘మిలన్ ఫ్యాషన్ వీక్‌’లో వీటి సేకరణ ప్రారంభించగా.. హిప్-హాప్ రాపర్, ప్రొడ్యూసర్ కాలీ హిజాబ్ ధరించి అనేక ఫొటోలకు పోజులిచ్చాడు. ఇది అతని మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించింది. కాగా హిజాబ్ తాను కోరుకునే ఒక ప్రత్యేకమైన వస్త్రమని, దీన్ని కలెక్షన్‌లో చేర్చేందుకు కంపెనీ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదని కాలీ తెలిపాడు.

అయితే బెనెటెన్ కొత్త కలెక్షన్.. ప్రధానంగా సోషల్ నెట్‌వర్క్స్‌లో విమర్శలు ఎదుర్కొంటోంది. దీనిపై రాజకీయ నాయకులు కూడా స్పందించారు. ‘ఇంక్లూసివ్ హిజాబ్‌ను మొదట మేము నకిలీ వార్తగా భావించాం. ఇది చాలా పిచ్చి పనిగా అనిపిస్తోంది. కానీ అమ్మకానికి అందుబాటులో ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. ఇది ఎవరికి ప్రయోజనం? మీరు దానిని కొనుగోలు చేయొద్దు.. ఇకపై బెనెటెన్‌కు వెళ్లొద్దు’ అంటూ LREM డిప్యూటీ అరోర్ బెర్గే సోషల్ మీడియాలో తన వ్యాఖ్యల్ని షేర్ చేశాడు.

Tags:    

Similar News