2024-2025 బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం.. రేపటికి లోక్‌సభ వాయిదా
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2024-2025 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2024-2025 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆదాయ వ్యయాల గురించి ప్రస్తావించిన మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. దీనికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అనంతరం రేపటికి(ఫిబ్రవరి 2 కు) లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు.
ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా ట్యాక్స్ ప్లేయర్లు, ఇళ్లులేని మధ్యతరగతి ప్రజలకు ఊతం లభించింది. అలాగే పేదలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందించనున్నట్లు తెలిపారు. దీంతోపాటుగా మౌలిక వసతుల రంగానికి రూ. 11. 11 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే.. ఆవాస్ యోజన కింద మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం, ఆశా వర్కర్లు, అంగన్‌వాడి కార్మికులకు ఆయూశ్మాన్ భారత్ వర్తింపు, భారత్ నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్‌కు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు. పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం, ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి.. దేశంలో కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.