ఐఐటీల్లో ప్రవేశాలకు నిబంధనల సడలింపు
దిశ, తెలంగాణ బ్యూరో: జేఈఈ అడ్వాన్స్ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంఖ్ స్పష్టతనిచ్చారు. కొవిడ్ కారణంగా గతంలో ఇబ్బందులు పడ్డారని, ఈ సారి అలాంటిదేమీ ఉండకూడదని ఆశించారు. కరోనా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని… జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసే ఇంటర్ విద్యార్థులు 75% మార్కులు కలిగి ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది సడలిస్తున్నట్టు ప్రకటించారు. గతంలో జనరల్ కేటగిరీ విద్యార్థులు ఇంటర్‌లో 75శాతం మార్కులు ఉంటేనే జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత లభించేది. ఈ […]
దిశ, తెలంగాణ బ్యూరో: జేఈఈ అడ్వాన్స్ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంఖ్ స్పష్టతనిచ్చారు. కొవిడ్ కారణంగా గతంలో ఇబ్బందులు పడ్డారని, ఈ సారి అలాంటిదేమీ ఉండకూడదని ఆశించారు. కరోనా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని… జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసే ఇంటర్ విద్యార్థులు 75% మార్కులు కలిగి ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది సడలిస్తున్నట్టు ప్రకటించారు. గతంలో జనరల్ కేటగిరీ విద్యార్థులు ఇంటర్‌లో 75శాతం మార్కులు ఉంటేనే జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత లభించేది. ఈ నిబంధనను ఇప్పుడు అమలు చేయడంలేదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. 2021 జూలై 3న జేఈఈ అడ్వాన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు. ఖరగ్‌పూర్ ఐఐటీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.