ఎనిమిది నేషనల్ హైవే రోడ్లకు భూమిపూజ

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జాతీయ రహదారులకు భూమి పూజ చేయగా, మరో ఆరింటిని జాతికి అంకితం చేశారు. మొత్తం రూ. 13,169 కోట్ల ఖర్చుతో నిర్మాణమవుతున్న ఈ జాతీయ రహదారుల్లో నాలుగు నల్లగొండ జిల్లాకు చెందినవి ఉన్నాయి. మొత్తం 766 కి.మీ. మేర రాష్ట్రానికి వస్తున్న ఈ రహదారులకు సంబంధించి జరిగిన వీడియో కాన్ఫరెన్సు […]

Update: 2020-12-21 12:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జాతీయ రహదారులకు భూమి పూజ చేయగా, మరో ఆరింటిని జాతికి అంకితం చేశారు. మొత్తం రూ. 13,169 కోట్ల ఖర్చుతో నిర్మాణమవుతున్న ఈ జాతీయ రహదారుల్లో నాలుగు నల్లగొండ జిల్లాకు చెందినవి ఉన్నాయి. మొత్తం 766 కి.మీ. మేర రాష్ట్రానికి వస్తున్న ఈ రహదారులకు సంబంధించి జరిగిన వీడియో కాన్ఫరెన్సు కార్యక్రమంలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, అధికారులు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఇతర నేతలు, అధికారులు కూడా పాల్గొన్నారు. జాతీయ రహదారుల దేశీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో తక్కువగా ఉందని, ఇతర రాష్ట్రాలకు సమాన స్థాయిలో మంజూరు చేసి త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

భూమిపూజ జరిగిన రోడ్లు
సూర్యాపేట – ఖమ్మం (58.62 కి.మీ; రూ. 2,054 కోట్లు)
మంచిర్యాల – రేపల్లెవాడ (42 కి.మీ; రూ. 1,556 కోట్లు)
రామ్‌సాన్‌పల్లె – మంగ్లూర్ (46.80 కి.మీ; రూ. 1,551 కోట్లు)
కంది – రామ్‌సాన్‌పల్లె (39.98 కి.మీ; రూ. 1,304 కోట్లు)
మంగ్లూర్ – మహారాష్ట్ర సరిహద్దు వరకు (48.96 కి.మీ; రూ. 1,247 కోట్లు)
రేపల్లెవాడ-మహారాష్ట్ర సరిహద్దు వరకు (52.602 కి.మీ; రూ. 1,226 కోట్లు)
నకిరేకల్ – నాగార్జునసాగర్ (85.45 కి.మీ; రూ. 369 కోట్లు)
కంకాపూర్ – ఖానాపూర్ (డబుల్ లైన్ 10 మీటర్ల వెడల్పు (21.10 కి.మీ; రూ. 141 కోట్లు)

జాతికి అంకితమైనవి:
యాదాద్రి – వరంగల్ (99 కి.మీ; రూ 1,889 కోట్లు)
నకిరేకల్ – తానంచెర్ల (డబుల్ లైన్ 10. మీ. వెడల్పు) – (66 కి.మీ; రూ. 604 కోట్లు)
ఓఆర్ఆర్–మెదక్ (62 కి.మీ; రూ. 426 కోట్లు)
మన్నెగూడ – రావులపల్లి (డబుల్ లైన్ 10 మీటర్ల వెడల్పు) – (72 కి.మీ; రూ. 359 కోట్లు)
ఆత్మకూరు – పస్రా (డబుల్ లైన్) – (34 కి.మీ; రూ. 230 కోట్లు)
మహాదేవపూర్ – భూపాలపల్లి (డబుల్ లైన్) – (33 కి.మీ; రూ. 206 కోట్లు)

Tags:    

Similar News