తెలంగాణలో పెద్ద ఎత్తున టెస్టులు చేయాలి: కిషన్‌రెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్ కొత్తగా పెట్టుకోవడానికి, కొత్త ప్రాంతాల్లో విస్తరించడానికి, కంటెన్మెంట్ జోన్లు ఏర్పాటుకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ఏ రకంగా కరోనా‌ను అరికట్టాలో సీఎం, అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవాలన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కలిసిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు. కరోనా వ్యాప్తి‌ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి […]

Update: 2020-07-08 11:38 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్ కొత్తగా పెట్టుకోవడానికి, కొత్త ప్రాంతాల్లో విస్తరించడానికి, కంటెన్మెంట్ జోన్లు ఏర్పాటుకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ఏ రకంగా కరోనా‌ను అరికట్టాలో సీఎం, అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవాలన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కలిసిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు. కరోనా వ్యాప్తి‌ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలను కేంద్రం అందిస్తుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను పెంచితే కేసులను తగ్గించుకోవచ్చన్నారు. కరోనా పేషెంట్లకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే హాస్పిటల్, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్రత్యేక బెడ్లను ఏర్పాట్లు చేసి వారికి అండగా ఉంటుందన్నారు.

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటే ప్రభుత్వం అధిక సంఖ్యలో టెస్టుల చేయడంతో పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం తరపున రూ. 215కోట్ల వైద్య పరికరాల కొనుగోలు కోసం అందించామన్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కావల్సిన అదనపు కిట్లను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లా కరోనా పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News