కేసీఆర్ లేఖ నా దృష్టికి రాలేదు !

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణానది నీటి వాటాల విషయంలో తెలుగు రాష్ట్రాల వాదనలు వింటామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్ ​తెలిపారు. తిరుమలలో శనివారం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ ​కేసీఆర్​ లేఖ నా దృష్టికి రాలేదని, ఈనెల 6న అపెక్స్ కౌన్సిల్​ భేటీ అవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పరంగా ఎవరి హక్కులకూ భంగం కలిగించబోమని, న్యాయబద్ధంగానే నీటి వాటాల పంపకాలు ఉంటాయన్నారు. సుప్రీంకోర్టు కేసులను దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరిస్తామని, పోలవరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం […]

Update: 2020-10-03 10:58 GMT

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణానది నీటి వాటాల విషయంలో తెలుగు రాష్ట్రాల వాదనలు వింటామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్ ​తెలిపారు. తిరుమలలో శనివారం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ ​కేసీఆర్​ లేఖ నా దృష్టికి రాలేదని, ఈనెల 6న అపెక్స్ కౌన్సిల్​ భేటీ అవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పరంగా ఎవరి హక్కులకూ భంగం కలిగించబోమని, న్యాయబద్ధంగానే నీటి వాటాల పంపకాలు ఉంటాయన్నారు. సుప్రీంకోర్టు కేసులను దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరిస్తామని, పోలవరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లులు క్లియర్ చేసినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News