భారత్‌లో ఐఫోన్ తయారీ యూనిట్లు -కేంద్రమంత్రి
దిశ, వెబ్‌డెస్క్: ప్రీమియం ఫోన్ బ్రాండ్ యాపిల్‌కు చెందిన ఐఫోన్‌లను తయారుచేసే 11 తయారీ యూనిట్లలో తొమ్మిది యూనిట్లు చైనా నుంచి భారత్‌కు మారినట్టు కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం వెల్లడించారు. వర్చువల్ విధానంలో జరిగిన బెంగళూరు టెక్ సమ్మిట్ 23వ ఎడిషన్ ప్రారంభ సమావేశంలో మాట్లాడిన మంత్రి, మహమ్మారి సమయంలో కూడా యాపిల్ తమ ఐఫోన్ తాయారీ యూనిట్లతో పాటు కాంపోనెంట్ తయారీ యూనిట్లను చైనా నుంచి భారత్‌కు మార్చారు. భారత్ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రీమియం ఫోన్ బ్రాండ్ యాపిల్‌కు చెందిన ఐఫోన్‌లను తయారుచేసే 11 తయారీ యూనిట్లలో తొమ్మిది యూనిట్లు చైనా నుంచి భారత్‌కు మారినట్టు కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం వెల్లడించారు. వర్చువల్ విధానంలో జరిగిన బెంగళూరు టెక్ సమ్మిట్ 23వ ఎడిషన్ ప్రారంభ సమావేశంలో మాట్లాడిన మంత్రి, మహమ్మారి సమయంలో కూడా యాపిల్ తమ ఐఫోన్ తాయారీ యూనిట్లతో పాటు కాంపోనెంట్ తయారీ యూనిట్లను చైనా నుంచి భారత్‌కు మార్చారు.
భారత్ సహా విదేశాలకు ఐఫోన్‌లను తయారు చేసేందుకు యాపిల్ సంస్థ బెంగళూరును ఎన్నుకోవడం సంతోషంగా ఉందని’ చెప్పారు. ఆయాపిల్ సరఫరా సంస్థ విస్ట్రాన్ ఇప్పటికే బెంగళూరులో తయారీ యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో యాపిల్ పరికరాలను విస్ట్రాన్ ఉత్పత్తి చేస్తోంది. విస్ట్రాన్ ప్రభుత్వం పీఎలై పథకం ద్వారా బెంగళూరు ప్లాంట్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు, రానున్న కొద్దిరోజుల్లో ఐఫోన్ 12 అసెంబ్లింగ్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ‘మొబైల్ తయారీని వేగవంతం చేసేందుకు, ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చాం. మహమ్మారి సమయంలో గ్లోబల్ సంస్థలు భారత్‌కు వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు కట్టుబడి ఉన్నాయని’ రవిశంకర్ ప్రసాద్ అన్నారు.