వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ను మరింత వేగంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు హాస్పిటళ్లను టీకా కేంద్రాలుగా వినియోగించుకోండని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో ఎంపానెల్ అయిన ప్రైవేటు హాస్పిటళ్లను వ్యాక్సినేషన్ సైట్లుగా గుర్తించడానికి కేంద్రం అనుమతించింది. తాజాగా, ఈ పథకాల్లో ఎంపానెల్ కాని ప్రైవేటు హాస్పిటళ్లనూ అంటే అన్ని ప్రైవేటు హాస్పిటల్స్‌ను టీకా కేంద్రాలుగా వినియోగించుకోవడానికి అనుమతినిచ్చింది. అయితే, […]
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ను మరింత వేగంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు హాస్పిటళ్లను టీకా కేంద్రాలుగా వినియోగించుకోండని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో ఎంపానెల్ అయిన ప్రైవేటు హాస్పిటళ్లను వ్యాక్సినేషన్ సైట్లుగా గుర్తించడానికి కేంద్రం అనుమతించింది.
తాజాగా, ఈ పథకాల్లో ఎంపానెల్ కాని ప్రైవేటు హాస్పిటళ్లనూ అంటే అన్ని ప్రైవేటు హాస్పిటల్స్‌ను టీకా కేంద్రాలుగా వినియోగించుకోవడానికి అనుమతినిచ్చింది. అయితే, ఆ కేంద్రాల్లో సరిపడా వ్యాక్సినేటర్లు సంఖ్య, వసతులు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ఈ సూచనలను రాష్ట్రాలకు తెలియజేశారు.