కొవిషీల్డ్ ధర రూ.210
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక అడుగు పడింది. మరో నాలుగు రోజుల్లో టీకాల పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ కొనుగోలు కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఒక్క డోసును రూ.200లకు కొనుగోలు చేయనున్నది. రూ.10 జీఎస్‌టీతో కలుపుకుని ఒక్కో డోసుకు రూ.210లు చెల్లించనున్నది. 10 కోట్ల డోసులను రూ.210లకు సరఫరా చేయనున్నామని, తొలి దశలో 1.10 కోట్ల డోసులను సరఫరా చేయనున్నట్లు సీరం ప్రతినిధి […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక అడుగు పడింది. మరో నాలుగు రోజుల్లో టీకాల పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ కొనుగోలు కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఒక్క డోసును రూ.200లకు కొనుగోలు చేయనున్నది. రూ.10 జీఎస్‌టీతో కలుపుకుని ఒక్కో డోసుకు రూ.210లు చెల్లించనున్నది. 10 కోట్ల డోసులను రూ.210లకు సరఫరా చేయనున్నామని, తొలి దశలో 1.10 కోట్ల డోసులను సరఫరా చేయనున్నట్లు సీరం ప్రతినిధి తెలిపారు.
డోసులు కొనుగోలుకు సంబంధించి సోమవారం కేంద్ర ప్రభుత్వం నుంచి సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ఆర్డర్ అందింది. తొలి విడత డోసులను పుణె నుంచి సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం సరఫరా చేయనున్నట్లు తెలుస్తున్నది. కొవిషీల్డ్ ధరపై రాతపూర్వకంగా ఒప్పందం కుదిరిందని, ప్రతి వారం లక్షల డోసులను సరఫరా చేయనున్నామని సీరం తెలిపింది. అత్యవసర వినియోగం కోసం సీరం, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లు అనుమతి పొందిన విషయం తెలిసిందే.