దారుణం.. కన్న కూతురు అని కూడా చూడకుండా తండ్రి, సోదరుడు..
దిశ, వెబ్‌డెస్క్ : కన్న కూతురు అని కూడా చూడకుండా ఓ తండ్రి.. యువతిని దారుణంగా హింసించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవలే బడేపూల్ తలావ్ గ్రామానికి చెందిన మహిళకు సమీప గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వివాహం అనంతరం పని కోసం ఆమె భర్త గుజరాత్‌కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళ మనస్తపానికి గురై.. అత్తవారింటి నుంచి పారిపోయి పుట్టింటికి చేరుకుంది. భర్త ఇంటి […]
దిశ, వెబ్‌డెస్క్ : కన్న కూతురు అని కూడా చూడకుండా ఓ తండ్రి.. యువతిని దారుణంగా హింసించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవలే బడేపూల్ తలావ్ గ్రామానికి చెందిన మహిళకు సమీప గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వివాహం అనంతరం పని కోసం ఆమె భర్త గుజరాత్‌కు వెళ్లాడు.
ఈ నేపథ్యంలో సదరు మహిళ మనస్తపానికి గురై.. అత్తవారింటి నుంచి పారిపోయి పుట్టింటికి చేరుకుంది. భర్త ఇంటి నుంచి పారిపోయి వచ్చిన మహిళపై కోపంతో తండ్రి, సోదరులు కలిసి ఆమెను చెట్టుకు వేలాడదీసి దారుణంగా కొట్టారు. అయితే, ఈ ఘటనను గ్రామంలోని ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి చేరడంతో కేసు నమోదుచేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు అధికారి విజయ్ భగవావి చెప్పారు.
Barbarism in tribal MP. 19-year-old girl, married 3 months back subjected to unimaginable torture by father and cousins on June 28, for leaving in-laws house and coming to maternal uncle's house in Alirajpur district. @NewIndianXpress @khogensingh1 @gsvasu_TNIE @TheMornStandard pic.twitter.com/U9Vf47BAtB
— Anuraag Singh (@anuraag_niebpl) July 2, 2021