తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు అందని వైద్యం
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులకు చికిత్సలు అందించే తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో కార్మికులకు వైద్యం అందించడం లేదని ఆర్టీసీ ఎంప్లాయిస్‌యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో 250 బెడ్స్ ఉంటే కేవలం 15 బెడ్స్‌ను మాత్రమే వాడుతున్నారని, 235 ఖాళీగా పెడుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల్లో 10 శాతం మాత్రమే మరణాలు ఉన్నాయని ఆర్టీసీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులకు చికిత్సలు అందించే తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో కార్మికులకు వైద్యం అందించడం లేదని ఆర్టీసీ ఎంప్లాయిస్‌యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో 250 బెడ్స్ ఉంటే కేవలం 15 బెడ్స్‌ను మాత్రమే వాడుతున్నారని, 235 ఖాళీగా పెడుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల్లో 10 శాతం మాత్రమే మరణాలు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు, తార్నాక ఆస్పత్రి వైద్యుడు శ్రీనివాస్ప్రకటించడం కరెక్ట్ కాదని, ఆర్టీసీలో మరణాల శాతం 20 వరకు ఉంటుందన్నారు.
కనీసం కార్మికులకు సరైన వైద్యం చేయడం లేదని, మందుల కోసం ఎక్కడికో పంపుతున్నారన్నారు. ఈ ఆస్పత్రిలో 100 బెడ్స్‌ను ఐసోలేషన్‌కు కేటాయించాలని కోరారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులు ఒకటీ, రెండు గదుల్లోనే అద్దెకు ఉంటున్నారని తెలిపారు. కరోనా పాజిటివ్‌వస్తే హోం క్వారంటైన్లో అవకాశం లేని కార్మికులకు ఇక్కడే వసతి కల్పించాలని సూచించారు.
అంతేకాకుండా తార్నాక ఆస్పత్రిలో కొవిడ్ కిట్లలో కూడా భారీ అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపించారు. పల్స్ఆక్షీ మీటర్లు పని చేయడం లేదన్నారు. కార్మికులకు ఇచ్చే కిట్లలో గ్లౌజులు ఉండటం లేదని, శానిటైజర్లు కూడా లేవని రాజిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ తర్వాత పెద్దాస్పత్రి అయిన కరీంనగర్లో కేవలం మందులు మాత్రమే ఇస్తున్నారని, పల్స్ మీటర్లు, శానిటైజర్లు, మాస్కులు ఇవ్వడం లేదన్నారు. కనీసం కరోనా కిట్స్ కూడా ఇవ్వని ఆస్పత్రులు ఎందుకని రాజిరెడ్డి ప్రశ్నించారు.