ప్లాన్ వర్కౌట్.. కేటీఆర్, హరీశ్ ఇలాకాలో ఊహించని మార్పు
దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 254 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత డిసెంబర్ మాసంలో సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటన సందర్భంగా.. రంగనాయక సాగర్, సిరిసిల్ల జిల్లాలోని అనంతగిరి రిజర్వాయర్‌లు ఉన్నాయని చెప్పామన్నారు. రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి జరుగనున్నాయని.. […]
దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రం వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 254 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత డిసెంబర్ మాసంలో సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటన సందర్భంగా.. రంగనాయక సాగర్, సిరిసిల్ల జిల్లాలోని అనంతగిరి రిజర్వాయర్‌లు ఉన్నాయని చెప్పామన్నారు. రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి జరుగనున్నాయని.. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగు వరుసలు రహదారి కావాలని కోరడం జరిగిందని గుర్తు చేశారు. దీంతో సీఎం నిధులు మంజూరు చేశారని.. ఈ సందర్భంగా హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నో ప్రయోజనాలు..
ఈ ఫోర్ లైన్ హైవే నిర్మాణం జరిగితే రెండు జిల్లాల ప్రజల ప్రయాణానికి కూడా సులభతరం కానుందన్నారు. ఈ మార్గాన్ని వెడల్పు చేస్తున్నందున.. సిద్దిపేట పట్టణం నుంచి ఇతర గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడి, వైద్య, విద్యాసంస్థలు, వ్యవసాయ మార్కెట్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సిద్దిపేట పట్టణం ఎల్లమ్మ టెంపుల్ నుంచి పెద్దకోడూర్, చిన్నకోడూర్ మండల కేంద్రం, సలంద్రి , కమ్మర్ల పల్లి, మైలారం, అల్లిపూర్, కిష్టాపూర్ జంక్షన్ మీదుగా సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కేంద్రం వరకు 32 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఫోర్ లైన్ రహదారి నిర్మాణంతో అటు ఇరు నియోజకవర్గాల ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.