క్రికెట్‌లో వైడ్ సిగ్నల్ ఇలా కూడా ఇస్తారా.. ఇండియన్ అంపైర్ ఫన్నీ సిగ్నల్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : క్రికెట్‌లో అంపైరింగ్ ఎంతో కీలకమైంది. కొన్ని సెంకడ్లలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది సరైన నిర్ణయం కాకపోతే.. అది మ్యాచ్ గమనాన్నే మార్చేస్తుంది. వైడ్, ఎల్బీడబ్ల్యూ, నోబాల్.. ఇలా ఏ నిర్ణయమైనా కచ్చితత్వంతో ఉండాల్సిందే. అయితే అంతర్జాతీయంగా, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల్లో కొందరు ఎంపైర్లు వినూత్నంగా అంపైరింగ్ చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్ బిల్లీ బౌడెన్‌కు ప్రత్యేకత ఉంది. ఆయన అంపైరింగ్ చేస్తున్నప్పుడు సిక్స్, ఫోర్, వైడ్, నో […]
దిశ, వెబ్‌డెస్క్ : క్రికెట్‌లో అంపైరింగ్ ఎంతో కీలకమైంది. కొన్ని సెంకడ్లలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది సరైన నిర్ణయం కాకపోతే.. అది మ్యాచ్ గమనాన్నే మార్చేస్తుంది. వైడ్, ఎల్బీడబ్ల్యూ, నోబాల్.. ఇలా ఏ నిర్ణయమైనా కచ్చితత్వంతో ఉండాల్సిందే. అయితే అంతర్జాతీయంగా, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల్లో కొందరు ఎంపైర్లు వినూత్నంగా అంపైరింగ్ చేస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్ బిల్లీ బౌడెన్‌కు ప్రత్యేకత ఉంది. ఆయన అంపైరింగ్ చేస్తున్నప్పుడు సిక్స్, ఫోర్, వైడ్, నో బాల్స్ సిగ్నల్స్‌ను ఢిపరెంట్‌గా ఇచ్చేవారు.
తాజాగా ఇండియన్ దేశవాళీ క్రికెట్‌లో ఓ అంపైర్ తన సరికొత్త అంపైరింగ్‌తో వార్తల్లో నిలిచారు. మహారాష్ట్ర స్థానిక క్రికెట్ టోర్నమెంట్పురందర్ ప్రీమియర్ లీగ్‌లో ఓ అంపైర్ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో అంపైర్ వైడ్ బాల్ సిగ్నల్‌ను డిఫరెండ్‌గా ఇచ్చారు. సాధారణంగా వైడ్ సిగ్నల్‌ను అంపైర్లు రెండు చేతులు చాచి ఇస్తుంటారు. కానీ ఈ అంపైర్ శీర్షాసనం వేసి మరీ రెండు కాళ్లు చాచి వైడ్ ఇచ్చాడు. ఆయన చేసిన ఈ ఫీట్‌ను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్రామంలో హిజ్రాలతో పూజలు.. మా ఊరికి రాకండి అంటూ బోర్డులు.. అసలేమైంది ?
What a way to signal wide#innovation @vikrantgupta73 @samiprajguru @cricketaakash pic.twitter.com/FN82RerIDC
— Durgesh Tripathi (@Durgeshjiclj) December 5, 2021