కూతురికి జన్మనిచ్చిన ఉమేష్ యాదవ్‌ భార్య

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్ ఉమేష్ యాదవ్ భార్య తాన్యా కొత్త సంవత్సరం రోజున పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరగాల్సిన టెస్టు మ్యాచ్‌లకు దూరమైన ఉమేష్‌కు ఇది అత్యంత ఆనందాన్ని ఇచ్చే వార్తే. ‘చిట్టి యువరాణికి సుస్వాగతం. నువ్వు ఈ ప్రపంచంలో అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది’ అనే క్యాప్షన్ జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పాప ఫొటో షేర్ చేశాడు. సహచర […]

Update: 2021-01-01 09:42 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పేసర్ ఉమేష్ యాదవ్ భార్య తాన్యా కొత్త సంవత్సరం రోజున పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరగాల్సిన టెస్టు మ్యాచ్‌లకు దూరమైన ఉమేష్‌కు ఇది అత్యంత ఆనందాన్ని ఇచ్చే వార్తే. ‘చిట్టి యువరాణికి సుస్వాగతం. నువ్వు ఈ ప్రపంచంలో అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది’ అనే క్యాప్షన్ జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పాప ఫొటో షేర్ చేశాడు. సహచర క్రికెటర్లు, అభిమానులే కాకుండా బీసీసీఐ కూడా ఉమేష్‌ను అభినందిస్తూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టింది. ఇది ఉమేష్‌కు అత్యంత సంతోషకరమైన వార్త.. త్వరలోనే కోలుకొని మైదానంలోకి అడుగుపెట్టాలని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. బాక్సింగ్ డే టెస్టులో గాయపడిన ఉమేష్ యాదవ్ బుధవారం రాత్రి ఇండియాకు తిరిగి పయనమయ్యాడు.

Tags:    

Similar News