ప్రధాని మోదీకి బ్రిటన్ ఆహ్వనం
దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో జరగబోయే జీ7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. భారత్‌నే కాకుండా ఆస్ట్రేలియా, సౌత్ కొరియాలను కూడా ఈ సదస్సుకు ప్రత్యేక అతిథులుగా యునైటెడ్ కింగ్‌డమ్ ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్ 11 నుంచి 13 వరకు జీ7 సమ్మిట్ జరగనుంది. ప్రపంచంలోని 7 ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థలైన యూకే, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, యూఎస్ఏ జీ7 దేశాలుగా ఉన్నాయి. జీ7 సమ్మిట్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో జరగబోయే జీ7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. భారత్‌నే కాకుండా ఆస్ట్రేలియా, సౌత్ కొరియాలను కూడా ఈ సదస్సుకు ప్రత్యేక అతిథులుగా యునైటెడ్ కింగ్‌డమ్ ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్ 11 నుంచి 13 వరకు జీ7 సమ్మిట్ జరగనుంది.
ప్రపంచంలోని 7 ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థలైన యూకే, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, యూఎస్ఏ జీ7 దేశాలుగా ఉన్నాయి. జీ7 సమ్మిట్‌లో భాగంగా ఈ దేశాలు కరోనా వైరస్ మహమ్మారి, పర్యావరణంలో వస్తున్న మార్పులు, సాంకేతికపరమైన మార్పులు, శాస్త్రీయ ఆవిష్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చించనున్నాయి.