‘ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ వద్దు’
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది. భౌతికంగా చాలా మంది ఒకచోట గుమిగూడే అవకాశమున్నందున మే నెలలో పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించవద్దని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. స్థానిక పరిస్థితులను సమీక్షించిన తర్వాతే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు, యూజీసీ నిబంధనలు ఉల్లంఘనకు గురికాకుండా పరిస్థితులు అదుపులో ఉంటేనే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థలన్నీ మే […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది. భౌతికంగా చాలా మంది ఒకచోట గుమిగూడే అవకాశమున్నందున మే నెలలో పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించవద్దని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. స్థానిక పరిస్థితులను సమీక్షించిన తర్వాతే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు, యూజీసీ నిబంధనలు ఉల్లంఘనకు గురికాకుండా పరిస్థితులు అదుపులో ఉంటేనే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థలన్నీ మే నెలలో ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించవద్దని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశించింది. జూన్ తొలి వారంలో దీనిపై సమీక్షిస్తామని తెలిపింది.