ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయాలి.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ఠాక్రేపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి నుండి వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ముఖేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిలిపి ఉంచిన కారు కేసుపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఠాక్రేకు సీఎంగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. మహారాష్ట్రలో ఓ పోలీసు ఉద్యోగే బాంబులు పెట్టానని చెబుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది. అత్యంత నమ్మకస్తులైన […]

Update: 2021-03-23 00:44 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ఠాక్రేపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి నుండి వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ముఖేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిలిపి ఉంచిన కారు కేసుపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఠాక్రేకు సీఎంగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు.

మహారాష్ట్రలో ఓ పోలీసు ఉద్యోగే బాంబులు పెట్టానని చెబుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది. అత్యంత నమ్మకస్తులైన పోలీసులే ఇలా చేస్తే ఎవరిని నమ్మాలి? ఇదంతా జరుగుతుంటే మహారాష్ట్ర పోలీసు ఉగ్రవాద నిరోధక వ్యవస్థ ఏం చేస్తుంది? అని ఆయన విమర్శించారు. ఇంతా జరుగుతున్నా సీఎం ఏం చేస్తు్న్నారని అన్నారు.

ఫిబ్రవరి 25 న ముంబయిలోని ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో నిలిచి ఉంచిన కారు నుంచి పేలుడు పదార్థాలు లభ్యమైన విషయం తెలిసిందే.

 

Tags:    

Similar News