ఆ దేశంలోకి భారత ప్రయాణికులపై బ్యాన్..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో గల్ఫ్ దేశం యూఏఈ ట్రావెల్ బ్యాన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల ఆదివారం మొదలు భారత్ నుంచి విమాన ప్రయాణాలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. పది రోజుల తర్వాత ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొంది. భారత్ నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టినవారే కాదు, గత 14 రోజుల్లో భారత్ గుండా ఇతర దేశాలకు వెళ్లిన ప్రయాణికులపైనా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఆ దేశం నుంచి భారత్‌కు ప్రయాణాలపై నిషేధం […]

Update: 2021-04-22 09:24 GMT

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో గల్ఫ్ దేశం యూఏఈ ట్రావెల్ బ్యాన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల ఆదివారం మొదలు భారత్ నుంచి విమాన ప్రయాణాలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. పది రోజుల తర్వాత ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొంది. భారత్ నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టినవారే కాదు, గత 14 రోజుల్లో భారత్ గుండా ఇతర దేశాలకు వెళ్లిన ప్రయాణికులపైనా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది.

అయితే, ఆ దేశం నుంచి భారత్‌కు ప్రయాణాలపై నిషేధం లేదని స్పష్టం చేసింది. కానీ, యూఏఈ నుంచి భారత్ గమ్యస్థానంగా విమాన టికెట్ల బుకింగ్‌ సేవలను ఎత్తేయనున్నట్టు వివరించింది. ఈ నిషేధం నుంచి దౌత్య అధికారులు, అధికార ప్రతినిధులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.

 

Tags:    

Similar News