ఆయువు తీసుకున్న ఆ ఇద్దరు
దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లాలో ఒకే రోజు వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు మందలించారని ఒకరు.. ఉద్యోగం పోయిందని మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాడ్వాయి మండలానికి చెందిన ప్రసాద్ (28) ఇంటి వద్దే ఉంటూ కాలాక్షేపం చేస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు ఉద్యోగం చేయాలని మందలించారు. ఎన్ని రోజులు జులాయిగా తిరుగుతావని తల్లి అనడంతో తీవ్రమనస్థాపానికి చెందిన ప్రసాద్ పురుగుల మందు తాగేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. మందలించినందుకు కొడుకు […]
దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లాలో ఒకే రోజు వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు మందలించారని ఒకరు.. ఉద్యోగం పోయిందని మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాడ్వాయి మండలానికి చెందిన ప్రసాద్ (28) ఇంటి వద్దే ఉంటూ కాలాక్షేపం చేస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు ఉద్యోగం చేయాలని మందలించారు. ఎన్ని రోజులు జులాయిగా తిరుగుతావని తల్లి అనడంతో తీవ్రమనస్థాపానికి చెందిన ప్రసాద్ పురుగుల మందు తాగేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. మందలించినందుకు కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు.
ఇక ఇదే మండలంలోని కాటాపూరం గ్రామానికి చెందిన మరోక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పాలకుర్తి అరవింద్ (24) అనే యువకుడు గతంలో వరంగల్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అయితే, కరోనా-లాక్‌డౌన్‌తో ఉద్యోగం పోయిందని స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఇక పొట్టకూటి కోసం కూరగాయల వ్యాపారం మొదలుపెట్టినా.. అందులో నష్టమే వచ్చింది. దీనికి తోడు అప్పులు కూడా వేధించసాగాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో అరవింద్ కూడా పురుగుల మందు తాగేశాడు.