ఏపీ ప్రజలు జాగ్రత్త.. రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 33 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 35కు చేరింది. తిరుపతిలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదు కాగ, విజయనగరంలో ఒక కేసు నమోదయ్యింది. దీంతో ఏపీ వైద్యశాఖ అలర్ట్ అయ్యింది. తిరుపతిలోని పెద్దకాపు వీధి నివాసి(34 సంవత్సరాలు) ఇదివరకే రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నాడు. యూకే […]

Update: 2021-12-12 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 33 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 35కు చేరింది. తిరుపతిలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదు కాగ, విజయనగరంలో ఒక కేసు నమోదయ్యింది. దీంతో ఏపీ వైద్యశాఖ అలర్ట్ అయ్యింది.

తిరుపతిలోని పెద్దకాపు వీధి నివాసి(34 సంవత్సరాలు) ఇదివరకే రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నాడు. యూకే నుంచి ఈనెల 8వ తేదీన ఢిల్లీ‌కి అక్కడి నుంచి తిరుపతికి వచ్చాడు. ఆదివారం అతనికి జీనోమ్ టెస్ట్ చెయ్యగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విజయనగరంలో ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఒకే రోజు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ఏపీ ప్రజలందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

Tags:    

Similar News