మరోసారి మంత్రి పదవుల అంశంపై మాట్లాడొద్దు.. సొంత పార్టీ ఎంపీకి CM రేవంత్ వార్నింగ్
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. ‘రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు.. ఇది మంచి పద్ధతి కాదు.. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుంది. మరోసారి ఈ అంశంపై మాట్లాడొద్దు. నేతలు, కార్యకర్తలను కన్‌ఫ్యూజ్ చేయొద్దని ఎంపీ చామలకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మనందరి లక్ష్యం ఒక్కటే అయ్యి ఉండాలి.. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలి. సన్నబియ్యం పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది.. దాన్ని పక్కదారి పట్టించడానికి బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) కుట్రలు చేస్తోంది.

దీనిని అందరూ సమర్దవంతంగా తిప్పటికొట్టాలి. త్వరలోనే ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా అపాయింట్‌మెంట్ ఇస్తా. రెండోసారి గెలవడానికి మీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే పనులను తీసుకురండి.. దగ్గరుండి నేనే చేయిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ ఇచ్చారు. రేపటి నుంచి ఎమ్మెల్యేలు ప్రతీ గ్రామంలో పర్యటించాలని సూచించారు. నేను కూడా మే ఫస్ట్ నుంచి జనాల్లోకి వెళ్తా.. నిన్న, మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్‌రెడ్డి మనపై విమర్శలు చేశారు.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ(PM Modi)యే రంగంలోకి దిగారు.. తెలంగాణ పథకాలతో మోడీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.