ఆన్‌లైన్‌ గేమింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్

దిశ, క్రైమ్‌బ్యూరో: బోయినపల్లి కేంద్రంగా ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై టాస్క్‌పోర్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నేరేడ్‌మెట్‌కు చెందిన చేతన్ బోగాని… అక్రమంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ మొదలుపెట్టి ఇందుకు గుజరాత్ నుంచి www.rkexch.com, www.fordexch.com ద్వారా గేమింగ్ బెట్టింగ్ నిర్వహించేందుకు ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్, కంప్యూటర్లలో కాసినో, అందర్ బహర్, తీన్ పట్టీ, త్రీ కార్డు, మట్కా, క్రికెట్, ఫుట్ […]

Update: 2020-07-29 08:00 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: బోయినపల్లి కేంద్రంగా ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై టాస్క్‌పోర్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నేరేడ్‌మెట్‌కు చెందిన చేతన్ బోగాని… అక్రమంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ మొదలుపెట్టి ఇందుకు గుజరాత్ నుంచి www.rkexch.com, www.fordexch.com ద్వారా గేమింగ్ బెట్టింగ్ నిర్వహించేందుకు ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్, కంప్యూటర్లలో కాసినో, అందర్ బహర్, తీన్ పట్టీ, త్రీ కార్డు, మట్కా, క్రికెట్, ఫుట్ బాల్, టెన్నీస్, బాక్సింగ్ మోటార్ స్పోర్ట్, కబాడీ, డ్రాగన్ టైగర్, బక్కార్ట్, పోకర్ ఆన్‌లైన్ సైట్స్‌ను డెవలప్ చేయించాడు.

ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ పట్ల ఆసక్తి కలిగిన వారికోసం ప్రత్యేకంగా లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను తయారు చేశాడు. అందుకు బోయిన్‌పల్లి శ్రీచంద్రకళా అపార్టుమెంట్‌‌ను ఎంచుకొని దాదాపు 50-60 మంది బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తూ లావాదేవీలను పోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్ ల ద్వారా లేదంటే నేరుగా చెల్లింపులు వచ్చేలా దందా చేస్తున్నాడు. బెట్టింగ్ నిర్వహణకు తిరానీ రాజేష్, అనంతుల నగేష్‌లను సబ్ ఆర్గనైజర్లుగా పెట్టుకున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇద్దరు ఆర్గనైజర్లను అరెస్ట్ చేయగా ప్రధాన నిర్వాహకుడు చేతన్ దీపక్ పరారీ‌లో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.3.15 లక్షలు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఇన్ స్టాల్ చేసిన 3సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News