కొవిడ్ ప్రాణాలంటే లెక్కేలేదు..100 రెమిడెసివిర్ ఇంజెక్షన్ల పట్టివేత..
దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తుంటే మరోవైపు కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్ దందా నిర్వహిస్తున్నారు. కొవిడ్ రోగుల ప్రాణాలు నిలబెట్టడానికి తీసుకొచ్చిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను తక్కువ ధరకు పొంది బ్లాక్ లో ఎక్కువకు అమ్ముకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి పొందిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ప్రైవేటు హాస్పిటళ్లకు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. కొవిడ్ సంక్షోభ సమయంలో రోగులకు రెమిడెసివిర్ […]
దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తుంటే మరోవైపు కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్ దందా నిర్వహిస్తున్నారు. కొవిడ్ రోగుల ప్రాణాలు నిలబెట్టడానికి తీసుకొచ్చిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను తక్కువ ధరకు పొంది బ్లాక్ లో ఎక్కువకు అమ్ముకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి పొందిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ప్రైవేటు హాస్పిటళ్లకు అధిక రేటుకు విక్రయిస్తున్నారు.
కొవిడ్ సంక్షోభ సమయంలో రోగులకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు దొరకకుండా మాయం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 100 ఇంజెక్షన్లను పోలీసులు పట్టుకున్నారు. వీటికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.