బ్లాక్ మార్కెట్‌లో కొవిడ్ సంజీవని.. ఇద్దరి అరెస్టు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. మాయదారి కరోనా తమ వరకు రాకూడదని క్షణం క్షణం భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు కరోనా బారిన పడి వారికి బెడ్స్ సరిపోక, వ్యాక్సినేషన్ కొరత వలన ఆస్పత్రులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇదిలాఉంటే కొందరు అక్రమార్కులు మాత్రం కరోనా పాండమిక్ లోనూ కాసుల సంపాదన మీద ఫోకస్ పెట్టారు. గుట్టుచప్పుడుకాకుండా రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. మాయదారి కరోనా తమ వరకు రాకూడదని క్షణం క్షణం భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు కరోనా బారిన పడి వారికి బెడ్స్ సరిపోక, వ్యాక్సినేషన్ కొరత వలన ఆస్పత్రులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇదిలాఉంటే కొందరు అక్రమార్కులు మాత్రం కరోనా పాండమిక్ లోనూ కాసుల సంపాదన మీద ఫోకస్ పెట్టారు.
గుట్టుచప్పుడుకాకుండా రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ ఎస్వోటీ పోలీసులు పలు మెడికల్ షాపులపై దాడులు నిర్వహించారు. రూ.14వేలకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహేశ్, రాజేశ్ లుగా గుర్తించారు. వీరి నుంచి 10 కోవిఫర్ ఇంజెక్షన్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, ఎవరైనా కొవిడ్ ఇంజెక్షన్లు బయట అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.