గర్భిణీ‌తో అలా చేసిన ఇద్దరు మెడికల్ స్టాఫ్ సస్పెండ్

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ నుంచి డబ్బులు తీసుకున్న మెడికల్ ఆఫీసర్ డా అరవింద్‎తో పాటు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ నాగేశ్వరరావును డీఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డా రమేష్ రెడ్డి శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై వెంటనే పూర్తి స్థాయి ఎంక్వైరీ నిర్వహించాలని నల్లగొండ జిల్లా అధికారిని డీఎంఈ అదేశించారు. పేషెంట్ల నుంచి డబ్బులు తీసుకున్న సిబ్బందిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఇదిలా […]

Update: 2021-08-14 11:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ నుంచి డబ్బులు తీసుకున్న మెడికల్ ఆఫీసర్ డా అరవింద్‎తో పాటు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ నాగేశ్వరరావును డీఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డా రమేష్ రెడ్డి శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై వెంటనే పూర్తి స్థాయి ఎంక్వైరీ నిర్వహించాలని నల్లగొండ జిల్లా అధికారిని డీఎంఈ అదేశించారు. పేషెంట్ల నుంచి డబ్బులు తీసుకున్న సిబ్బందిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా నాగార్జున సాగర్ ప్రభుత్వాసుపత్రిలో పేషెంట్లు డబ్బులు ఇస్తేనే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని వైద్యశాఖకు ఫిర్యాదులు అందాయి. ఒక్కో సిజేరియన్ కు రూ. 5 వేల చొప్పున వసూల్ చేస్తున్నట్లు ఆరోపించారు. గత 8 నెలల నుంచి ఈ తతాంగం జరుగుతున్నా సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదని పలువురు పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఇటీవల స్థానిక ఎంఎల్ఏ సైతం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

Tags:    

Similar News