మీతో కరోనా సోకుతోందంటూ మహిళా డాక్టర్లపై దాడి
దిశ, వెబ్ డెస్క్: మీ వల్ల నాకు కరోనా సోకుతదంటూ ఓ వ్యక్తి ఇద్దరు డాక్టర్లపై దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్లితే.. సఫ్దర్ జంగ్ ప్రభుత్వాసుపత్రికి చెందిన ఇద్దరు మహిళా డాక్టర్లు పండ్లు తీసుకునేందుకు బుధవారం గుల్మోహర్ ఎన్ క్లేవ్ ప్రాంతంలో తమ ఇంటి నుంచి బయటికొచ్చారు. మార్కెట్ కు చేరుకుని పండ్లు తీసుకుంటుండగా ఓ వ్యక్తి ఆ ఇద్దరు డాక్టర్లను ‘ మీరు దూరంగా ఉండండి.. మీరు […]
దిశ, వెబ్ డెస్క్: మీ వల్ల నాకు కరోనా సోకుతదంటూ ఓ వ్యక్తి ఇద్దరు డాక్టర్లపై దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్లితే.. సఫ్దర్ జంగ్ ప్రభుత్వాసుపత్రికి చెందిన ఇద్దరు మహిళా డాక్టర్లు పండ్లు తీసుకునేందుకు బుధవారం గుల్మోహర్ ఎన్ క్లేవ్ ప్రాంతంలో తమ ఇంటి నుంచి బయటికొచ్చారు. మార్కెట్ కు చేరుకుని పండ్లు తీసుకుంటుండగా ఓ వ్యక్తి ఆ ఇద్దరు డాక్టర్లను ‘ మీరు దూరంగా ఉండండి.. మీరు ఆస్పత్రిలో కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. మీకు కూడా కరోనా సోకిందేమో.. మీ వల్ల నాకు కరోనా సోకే అవకాశముంది.. దూరంగా ఉండండి’ అంటూ వారిని దుర్భాషలాడాడు. దీంతో ఇదేంటనీ ఆ డాక్టర్లు అతడిని ప్రశ్నించారు. అతను అంతటితో ఆగకుండా ఆ డాక్టర్లను తిడుతూ మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండంటూ, నోటికొచ్చినట్లు తిడుతూ వారిపై దాడి చేశాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
డాక్టర్లపై దాడిని ఖండిస్తూ సఫ్ధర్ జంగ్ ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డాక్టర్లపై దాడి చేయడం దారుణన్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు డాక్టర్లు కోవిడ్-19 విధుల్లో లేరని ఆయన పేర్కొన్నారు. కాగా, బాధిత మహిళా డాక్టర్లిద్దరకీ కరోనా పరీక్షలు నిర్వహించినట్లుల పోలీసులు తెలిపారు.
Tags: delhi, two doctors assaulted, safdarjung hospital, police, case file, corona