మితిమీరిన వేధింపులు.. రన్నింగ్ బస్సు నుంచి దూకిన అమ్మాయిలు
దిశ, వెబ్‌డెస్క్ : నలుగురు ఆకతాయిల వేధింపులు మితిమీరడంతో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు యువతులు రన్నింగ్ బస్సు నుంచి దూకేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. ప్రయాణిస్తున్న బస్సులో అమ్మాయిలకు ఎదురుగా కూర్చున్న యువకుల ప్రవర్తన అబ్ నార్మల్‌గా ఉండటంతో యువతులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. బస్సు ఆపాలని ఎన్నిమార్లు బ్రతిమిలాడిన డ్రైవర్ వినిపించుకోకపోవడంతో విద్యార్థినులు ధైర్యం చేసి రన్నింగ్ బస్సు నుంచి దూకేశారు. కిందకు దూకిన ఇద్దరు […]
దిశ, వెబ్‌డెస్క్ : నలుగురు ఆకతాయిల వేధింపులు మితిమీరడంతో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు యువతులు రన్నింగ్ బస్సు నుంచి దూకేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. ప్రయాణిస్తున్న బస్సులో అమ్మాయిలకు ఎదురుగా కూర్చున్న యువకుల ప్రవర్తన అబ్ నార్మల్‌గా ఉండటంతో యువతులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
బస్సు ఆపాలని ఎన్నిమార్లు బ్రతిమిలాడిన డ్రైవర్ వినిపించుకోకపోవడంతో విద్యార్థినులు ధైర్యం చేసి రన్నింగ్ బస్సు నుంచి దూకేశారు. కిందకు దూకిన ఇద్దరు అమ్మాయిల్లో ఒకరికి తల, కాలు, నడుముకు గాయాలు కాగా.. మరొకరికి చేయి, కాలు విరిగినట్లు సమాచారం.