ములుగులో వరదలు.. ఇద్దరు గల్లంతు

దిశ, ములుగు : ములుగు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లా జలదిగ్భందంలో చిక్కుకుంది. జంగాలపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపైకి రామప్ప సరస్సు నీరు చేరుకోవడంతో ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిలిపివేస్తున్నారు. జంగాలపల్లి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం 7 గంటల ప్రాంతంలో బైక్ పై వస్తున్న […]

Update: 2020-08-20 04:04 GMT

దిశ, ములుగు : ములుగు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లా జలదిగ్భందంలో చిక్కుకుంది. జంగాలపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపైకి రామప్ప సరస్సు నీరు చేరుకోవడంతో ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిలిపివేస్తున్నారు.

జంగాలపల్లి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం 7 గంటల ప్రాంతంలో బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిని బండారుపల్లికి చెందిన మత్స్యకారులు అల్లం శివాజీ, కవిరాజుగా గుర్తించారు. మేడివాగు దగ్గర బైక్ పై వెళ్తుండగా అక్కడ ఆగిన క్రమంలో అదుపుతప్పి వాగులో పడిపోయినట్లు తెలిసింది. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News