మద్యం తరలిస్తూ పట్టుబడ్డ పోలీసులు
దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ సమయంలో అక్రమంగా లిక్కర్ తరలిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉల్లిగడ్డల విజయ్ (30) ఓ కారులో అక్రమంగా మద్యాన్ని గుంటూరుకు తరలిస్తుండగా.. వనస్థలిపురం వద్ద పోలీసులు కారును ఆపి చెక్ చేశారు. కారులో మద్యం బాటిల్స్ బయటపడ్డాయి. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహాలోనే మలక్‌పేట్ ట్రాఫిక్ […]
దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ సమయంలో అక్రమంగా లిక్కర్ తరలిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉల్లిగడ్డల విజయ్ (30) ఓ కారులో అక్రమంగా మద్యాన్ని గుంటూరుకు తరలిస్తుండగా.. వనస్థలిపురం వద్ద పోలీసులు కారును ఆపి చెక్ చేశారు. కారులో మద్యం బాటిల్స్ బయటపడ్డాయి. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహాలోనే మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అనిల్ కుమార్ సూర్యాపేట నుంచి నగరానికి మద్యాన్ని తరలించే ప్రయత్నం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుంచి పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. కాగా, లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులే మద్యం తరలిస్తూ దొరికిపోవడం గమనార్హం.
tag: moving alcohol, constable, police, arrest, hyderabad