గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండలం పోచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చర్చి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసింది. మృతుల్లో చర్చి ఫాదర్ దిలీప్ కుమారుడు హనిల్ సన్ ( 4 ), మరో బాలికను జయశ్రీ అలియాస్ గ్రేసి (4)గా గుర్తించారు. చర్చి నిర్మాణం కోసం పునాదులు తీయగా, ఇటీవల కురిసిన వర్షానికి గుంతలు […]

Update: 2021-09-05 05:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండలం పోచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చర్చి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసింది. మృతుల్లో చర్చి ఫాదర్ దిలీప్ కుమారుడు హనిల్ సన్ ( 4 ), మరో బాలికను జయశ్రీ అలియాస్ గ్రేసి (4)గా గుర్తించారు. చర్చి నిర్మాణం కోసం పునాదులు తీయగా, ఇటీవల కురిసిన వర్షానికి గుంతలు మొత్తం నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలోనే అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడి మ‌ృతి చెందారు. చిన్నారుల మృతి రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ మేరకు నాగిరెడ్డి పేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags:    

Similar News