బల్కంపేట అమ్మవారికి బంగారు చీర

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సీఎం పుట్టిన రోజు కానుకగా రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించారు. బెంగళూరులో తయారుచేసిన ఈ చీరను.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూన వెంకటేశ్ గౌడ్‌ల చేతుల మీదుగా ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. ఈ బంగారు చీరను టీఆర్ఎస్ నేతలు కూన వెంకటేశ్ గౌడ్, శివరామకృష్ణారెడ్డిలు.. సీఎం పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారికి కానుకగా […]

Update: 2021-02-17 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సీఎం పుట్టిన రోజు కానుకగా రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించారు. బెంగళూరులో తయారుచేసిన ఈ చీరను.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూన వెంకటేశ్ గౌడ్‌ల చేతుల మీదుగా ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. ఈ బంగారు చీరను టీఆర్ఎస్ నేతలు కూన వెంకటేశ్ గౌడ్, శివరామకృష్ణారెడ్డిలు.. సీఎం పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారికి కానుకగా చేయించడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నిండు ఆరోగ్యంతో ఉండాలని.. మరింత కాలం రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించాలన్నారు. సీఎం జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News