కడుపులోనే కవలలు మృతి.. కారణం ఇదే!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. అంబులెస్స్ కోసం ఓ గర్భిణి ఐదు గంటలుగా ఎదురు చూడటంతో కడుపులోనే కవల పిల్లలు చనిపోయారు. ఈ ఘటన జిల్లాలోని గిద్దలూరులో బుధవారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. గర్భిణి మహిళా అబార్షన్ కోసమని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ అబార్షన్ చేసేందుకు సరైన సౌకర్యాలు లేవని చెప్పిన డాక్టర్లు ఒంగోలులోని రిమ్స్‌కు వెళ్లాలని సూచించారు. అయితే, అంబులెన్స్ కోసం ఎదురుచూడగా 5గంటలు గడచినా రాలేదు. అప్పటికే పరిస్థితి విషమించడంతో […]

Update: 2020-07-22 11:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. అంబులెస్స్ కోసం ఓ గర్భిణి ఐదు గంటలుగా ఎదురు చూడటంతో కడుపులోనే కవల పిల్లలు చనిపోయారు. ఈ ఘటన జిల్లాలోని గిద్దలూరులో బుధవారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. గర్భిణి మహిళా అబార్షన్ కోసమని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ అబార్షన్ చేసేందుకు సరైన సౌకర్యాలు లేవని చెప్పిన డాక్టర్లు ఒంగోలులోని రిమ్స్‌కు వెళ్లాలని సూచించారు. అయితే, అంబులెన్స్ కోసం ఎదురుచూడగా 5గంటలు గడచినా రాలేదు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆ మహిళ కడుపులోకి కవల పిల్లలు చనిపోయారు. కారణం తెలుసుకోవడానికి ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. వైద్యుల నిర్లక్ష్యం మూలానే కవలలు చనిపోయారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News