ప్రేమించడం లేదని చంపేశాడు.. ఆ తర్వాత..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించడం లేదని యువతి ప్రాణాలు తీశాడు ప్రేమోన్మాది. దీనికి ప్రతికారంగా రాళ్లతో యువకుడిని కొట్టిచంపారు స్థానికులు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగ హౌసింగ్ కాలనీలో వెలుగుచూసింది. స్థానికంగా డ్రైవర్‌గా పని చేస్తున్న చిన్నా.. సుస్మిత అనే యువతిని గత రెండేళ్లుగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. అప్పటి నుంచే చిన్నా ప్రేమను నిరాకరిస్తూ వచ్చిన సుస్మితపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం సాంబయ్య కండ్రిగ హౌసింగ్ కాలనీలోని యువతి […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించడం లేదని యువతి ప్రాణాలు తీశాడు ప్రేమోన్మాది. దీనికి ప్రతికారంగా రాళ్లతో యువకుడిని కొట్టిచంపారు స్థానికులు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగ హౌసింగ్ కాలనీలో వెలుగుచూసింది. స్థానికంగా డ్రైవర్‌గా పని చేస్తున్న చిన్నా.. సుస్మిత అనే యువతిని గత రెండేళ్లుగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. అప్పటి నుంచే చిన్నా ప్రేమను నిరాకరిస్తూ వచ్చిన సుస్మితపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం సాంబయ్య కండ్రిగ హౌసింగ్ కాలనీలోని యువతి ఇంటికొచ్చిన చిన్నా ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా గొంతుకోసుకునే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో మృతురాలి బంధువులు, స్థానికులు యువకుడిపై రాళ్లతో కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.