సరికొత్త రేసింగ్ బైకును విడుదల చేసిన టీవీఎస్ మోటార్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ భారత మార్కెట్లో తన కొత్త రేసింగ్ పర్ఫార్మెన్స్ సిరీస్ ఆర్టీఆర్ 165ఆర్పీ బైకును విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ కోసం వినియోగదారులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని, దీన్ని లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా 200 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్లో దీని ధరను రూ. 1.45 లక్షలుగా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ 164.9సీసీ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ భారత మార్కెట్లో తన కొత్త రేసింగ్ పర్ఫార్మెన్స్ సిరీస్ ఆర్టీఆర్ 165ఆర్పీ బైకును విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ కోసం వినియోగదారులు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని, దీన్ని లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా 200 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. దేశీయ మార్కెట్లో దీని ధరను రూ. 1.45 లక్షలుగా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది.
ఈ బైక్ 164.9సీసీ ఇంజిన్ సామర్థ్యంతో వస్తుందని, స్లీపర్ క్లచ్, బ్రేక్ లివర్స్, సరికొత్త సిటింగ్ సౌకర్యం, అడ్జస్టబుల్ క్లచ్ సహా ఇంకా అనేక అత్యాధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చామని కంపెనీ వివరించింది. రేసింగ్ పర్ఫార్మెన్స్ కోసం హై-డ్యురేషన్ కెమెరాలతో పాటు 5-స్పీడ్ గేర్‌బాక్స్, డ్యుయెల్ స్ప్రింగ్ ఆక్యూయేటర్లను అమర్చినట్టు కంపెనీ తెలిపింది. కేవలం రేసింగ్ విభాగం కోసమే ఈ బైకును తీసుకొచ్చిన నేపథ్యంలో మిగిలిన వాటికంటే ఎక్కువ, మెరుగైన పనితీరును ఈ బైకులు అందిస్తాయని, రేస్ ట్రాక్‌లతో పాటు సాధారణ రోడ్లపై కూడా ప్రయాణించడానికి వీలుగా వీటి తయారీలో జాగ్రత్తలు తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.