దిశ ఎఫెక్ట్.. అధికారుల యాక్షన్
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ :‘రూ.1000 కోట్ల పార్కులు మాయం’ శీర్షికన దిశ పత్రికలో మంగళవారం వచ్చిన కథనంపై తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు స్పందించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ ఎంఎం కుంట సుప్రీతానగర్ సర్వే నెంబర్ 536, 537, 657, 658లో పార్కు స్థలం ఆక్రమణకు గురైందని దిశ పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీనిపై వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా, టీపీవో ఉమ, మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. కబ్జాకు […]
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ :‘రూ.1000 కోట్ల పార్కులు మాయం’ శీర్షికన దిశ పత్రికలో మంగళవారం వచ్చిన కథనంపై తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు స్పందించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ ఎంఎం కుంట సుప్రీతానగర్ సర్వే నెంబర్ 536, 537, 657, 658లో పార్కు స్థలం ఆక్రమణకు గురైందని దిశ పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీనిపై వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా, టీపీవో ఉమ, మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. కబ్జాకు గురైన పార్కు స్థలంలో బుధవారం ప్రభుత్వ స్థలంగా బోర్డు ఏర్పాటు చేయించారు. ఆక్రమణదారులు వెంటనే స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లాలని నోటీసు బోర్డులో పేర్కొన్నారు.
ఆక్రమణలను ఉపేక్షించేది లేదు
ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమణలను ఉపేక్షించేది లేదు. ఆక్రమణకు గురైన పార్కుల స్థలాలు గుర్తించే పనిలో ఉన్నాం. ఇప్పటికే ఐదు పార్కు స్థలాలను గుర్తించి మున్సిపల్ బోర్డు ఏర్పాటు చేశాం. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ ఎంఎం కుంట సుప్రీతానగర్ సర్వే నెంబర్ 536, 537, 657, 658లో ఆక్రమణకు గురైన పార్కు స్థలంలో బోర్డు పెట్టాం. త్వరలో ఆక్రమణదారులకు నోటీసులు ఇస్తాం. సర్వే నెంబర్లకు బై నెంబర్లు కూడా ఉన్నందున అంతా విచారించిన తర్వాత అందులోని నిర్మాణాలను కూల్చేస్తాం. పార్కు స్థలాలను రక్షించేందుకు ఇక నుంచి వారానికి ఒకసారి క్షేత్రస్థాయి పర్యటన చేస్తాం.
– మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా