ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ పుష్కరఘాట్ లో సీఎం జగన్ పుష్కరాలను ప్రారంభించారు. తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ, సారె సమర్పించారు. ఇక తెలంగాణలోని గద్వాలలో తుంగభద్ర పుష్కరాలను మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. నేటి నుంచి 12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరఘాట్ లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు […]

Update: 2020-11-20 02:54 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ పుష్కరఘాట్ లో సీఎం జగన్ పుష్కరాలను ప్రారంభించారు. తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ, సారె సమర్పించారు. ఇక తెలంగాణలోని గద్వాలలో తుంగభద్ర పుష్కరాలను మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

నేటి నుంచి 12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరఘాట్ లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతించనున్నారు. పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్లు పైబడిన వారు రావొద్దని సూచించారు. పుష్కరఘాట్లలో థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే భక్తులను అనుమతించనున్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News