సింహరాశి వారికి వివాహ బలం ఎలా ఉందో తెలుసుకోండిలా..

తేది : 22 జూన్ 2021 ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : మంగళవారం పక్షం : శుక్లపక్షం తిథి : ద్వాదశి (నిన్న మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 21 ని॥ వరకు) నక్షత్రం : విశాఖ (నిన్న సాయంత్రం 4 […]

Update: 2021-06-21 12:11 GMT

తేది : 22 జూన్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ద్వాదశి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 21 ని॥ వరకు)
నక్షత్రం : విశాఖ
(నిన్న సాయంత్రం 4 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 21 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : బాలవ
వర్జ్యం : ( సాయంత్రం 5 గం॥ 56 ని॥ నుంచి రాత్రి 7 గం॥ 21 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఉదయం 6 గం॥ 25 ని॥ నుంచి 7 గం॥ 51 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 8 గం॥ 20 ని॥ నుంచి 9 గం॥ 12 ని॥ వరకు)(ఉదయం 10 గం॥ 1 ని॥ నుంచి 10 గం॥ 53 ని॥ వరకు)
రాహుకాలం : (సాయంత్రం 3 గం॥ 35 ని॥ నుంచి 5 గం॥ 13 ని॥ వరకు)
గుళికకాలం : (ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 8 గం॥ 59 ని॥ నుంచి 10 గం॥ 37 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : తుల

మేషరాశి : ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను తెస్తాయి. ఆఫీసు పనులను అధిక శ్రమతో పూర్తి చేయవలసి వస్తుంది. జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ. కొంతమందికి చిన్న అప్పులు చేయవలసి రావచ్చు. వేడి చేయటం వలన పొట్టలో ఇబ్బంది. బాగా నీళ్లు తాగండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తల మధ్య గొడవల వల్ల బంధాలు తెగకుండా చూసుకోండి.

వృషభ రాశి : బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు అనుకున్న కార్యాలను సాధించాలంటే పట్టుదల, సరైన ప్రణాళిక తప్పనిసరి విదేశాలతో వ్యాపారం చేసే వారికి లాభాలు. ఆఫీసులో పనులను అధిక శ్రమతో సకాలంలో పూర్తి చేస్తారు. పుకార్లను నమ్మకండి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది.

మిధున రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం, పట్టుదల అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. కొంత మంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారితో పరుషంగా మాట్లాడకండి. ఈ రాశి స్త్రీల కి మీ భర్త యొక్క అనారోగ్యం మీకు మానసిక అశాంతి. కంగారు పడవలసిన అవసరం లేదు.

కర్కాటక రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం పట్టుదల అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. స్నేహితులతో అనవసరపు బాతాఖానీ వల్ల చదువు మీద శ్రద్ధ పెట్టలేరు సమయం వృధా. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. అనుకోని అతిథుల వలన అనవసరపు ఖర్చు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితంలో కొన్ని రోజులను గుర్తుకు తెస్తుంది.

సింహరాశి : స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. వివాహం కాని వారికి సంబంధం కుదిరే అవకాశం. కొంతమంది ఇంటికి కొత్తగా పాప /బాబు రాబోతున్నారు. అనవసరపు దుబారా ఖర్చులను నివారించమని కుటుంబ సభ్యులకు చెప్పండి. భార్య అనారోగ్యం మిమ్మల్ని కంగారు పెడుతుంది. ఆఫీసులో పనులను అధిక శ్రమతో పూర్తి చేస్తారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కన్యారాశి : ఆవేశాన్ని వదిలివేయండి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. దైవ ప్రార్థన వలన బలం. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను తెస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆఫీసు పనులలో అధిక బాధ్యతల వలన ఒత్తిడి. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్. అధిక శ్రమ వలన తలనొప్పి. ఆదాయం కన్నా కంటే ఎక్కువ. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క పరుష వాక్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

తులారాశి : ఫిట్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. వెన్నునొప్పి బాధించవచ్చు. విశ్రాంతి ఒక మంచి ఉపాయం. ఆఫీసులో పెండింగ్ పనులను అధిక శ్రమతో పూర్తి చేస్తారు. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్. మిమ్మల్ని అప్పు అడిగే వారిని పక్కకు పెట్టండి. ఇంటిలో శుభకార్యం జరిగే అవకాశం. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితంఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి : ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొంత మంది ఇళ్లు కొనుగోలు చేస్తారు. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. వివాదాస్పద వ్యవహారాల జోలికి వెళ్ళకండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది అనవసరపు ఖర్చులను నివారించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడటం వలన వారు హర్ట్ అవుతారు. స్నేహితులతో అనవసరపు బాతాఖానీ వలన సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

ధనస్సు రాశి : ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే డబ్బు పొదుపు చేయండి. ఆఫీసులో అధిక బాధ్యతలు ఉన్నా పనులను సకాలంలో చాకచక్యంగా పూర్తిచేస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కావాల్సినంత ధనం చేతికందుతుంది మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

మకర రాశి : ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త. ఆవేశంతో కాక సహనంతో ఆలోచించండి కొంతమందికి ఉద్యోగ పరంగా టూర్స్. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. అవసరాలకు తగినంత ఆదాయం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ చల్లటి పదార్థాలు తాగటం వలన జలుబు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణ మిమ్మల్ని ఆనందింప చేస్తుంది.

కుంభరాశి : ఆత్మ విశ్వాసం పట్టుదల మీ ఆయుధాలు. సహనంతో ఆలోచించండి. రంగంలోకి దిగక ముందు పిల్లిలా ఉన్న మీరు రంగంలోకి దిగిన తర్వాత పులి అవుతారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఆదాయ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసు పనులలో అధిక బాధ్యతల వలన ఒత్తిడి అధిక శ్రమ. పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి ఫిట్ నెస్ వలన అన్ని కార్యాలను సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మీనరాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ప్రయాణాలలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఉన్న ఊరికి పిల్లలకు దూరంగా ఉండడం వలన మానసిక అశాంతి. కొంతమంది ఇంటికి కొత్తగా పాప /బాబు రాబోతున్నారు. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. సరైన సమయానికి సరైన భోజనం ఆరోగ్యాన్నిస్తుంది. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. వారు హర్ట్ అవుతారు. ఆఫీసులో పనులను సక్రమంగా పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

Tags:    

Similar News