ఉప ఎన్నిక గెలుపుకోసం KCR రాక్షస రాజకీయాలు: కాట్రగడ్డ ప్రసూన
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ రాజకీయ రాక్షస క్రీడ ఆడుతుందని టీటీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్ లో గురువారం మీడియా సమావేశంలో ప్రసూన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని వదిలి హుజురాబాద్ లో మాత్రమే వరాల జల్లులు కురిపిస్తున్నారని విమర్శించారు. ఉపఎన్నిక విజయం కోసమే దళిత బంధు, 57 ఏళ్లకే ఫించన్లు, రేషన్ కార్డులను ఇచ్చారన్నారు. రాష్ట్రమొస్తే ఉద్యోగాలొస్తయని ఆశగా చూసిన నిరుద్యోగులను సీఎం కేసీఆర్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ రాజకీయ రాక్షస క్రీడ ఆడుతుందని టీటీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్ లో గురువారం మీడియా సమావేశంలో ప్రసూన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని వదిలి హుజురాబాద్ లో మాత్రమే వరాల జల్లులు కురిపిస్తున్నారని విమర్శించారు. ఉపఎన్నిక విజయం కోసమే దళిత బంధు, 57 ఏళ్లకే ఫించన్లు, రేషన్ కార్డులను ఇచ్చారన్నారు. రాష్ట్రమొస్తే ఉద్యోగాలొస్తయని ఆశగా చూసిన నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రాక ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి మా పార్టీని వదిలి వెళ్లారని, అయినా టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడి కేబినేట్ లో పనిచేసిన వారేనని గుర్తు చేశారు. మంత్రి పదవుల్లో ఉన్న ఎర్రబెల్లి, తలసాని కూడా మా పార్టీ నుంచి వెళ్లినవారేనని, అంటే వీరు కూడా చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సులు నిలిపివేయడం సరికాదన్నారు. మెళ్లిగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి ఆస్తులను అమ్ముకుంటారా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి తులసీ, తెలుగు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత తదితరులు పాల్గొన్నారు.