టీఆర్ఎస్ ఆహ్వానంపై 'దిశ'కు టీటీడీపీ చీఫ్ రమణ క్లారిటీ

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ వీడబోతున్నారా..? ఆయనకు టీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చిందా..? ఇంతకీ ఆయన ఏమనుకుంటున్నారు…? తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని, నేడో రేపో టీడీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుతోంది. అయితే రమణ టీడీపీని వీడే ఆలోచనలో లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారడం వల్ల ఒరిగేది లేదని, రెండేళ్లుగా రమణకు […]

Update: 2021-06-07 04:53 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ వీడబోతున్నారా..? ఆయనకు టీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చిందా..? ఇంతకీ ఆయన ఏమనుకుంటున్నారు…? తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని, నేడో రేపో టీడీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుతోంది. అయితే రమణ టీడీపీని వీడే ఆలోచనలో లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారడం వల్ల ఒరిగేది లేదని, రెండేళ్లుగా రమణకు టీఆర్ఎస్ నుండి పిలుపు వస్తున్నా ఆయన మాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది.

టీఆర్ఎస్ లో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామన్న ఆఫర్ కూడా చాలా రోజుల క్రితమే రమణకు టీఆర్ఎస్ అధిష్టానం నుండి వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా జూన్ 1న కూడా పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రమణకు ఫోన్ చేసి మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ బలపడడం అసాధ్యమని, టీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించినట్టుగా సమాచారం. వెనువెంటనే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని అందరితో చర్చించిన తరువాత ఓ నిర్ణయానికి వస్తానని రమణ ఎర్రబెల్లితో చెప్పినట్టు సమాచారం.

చేరితే ఏంటి… చేరకపోతే ఏంటీ..?

ఎల్ రమణ ఇప్పటికే అత్యంత సన్నిహితులతో పార్టీ మారాలని వచ్చిన ప్రతిపాదన గురించి చర్చించినట్టు సమాచారం. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ బలంగా లేకున్నప్పటికీ, స్టేట్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తాను స్వతంత్ర నిర్ణయాలతో ముందుకు సాగుతున్నానన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే రెండున్నర దశాబ్దాలకు పైగా టీడీపీతో ఉన్న అనుభందంతో పాటు, అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని కాదని పార్టీ మారడం కూడా సరైంది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఆహ్వానం వచ్చింది నిజమే

టీఆర్ఎస్ లో చేరాలని తనను ఆహ్వనించిన మాట నిజమేనని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ’దిశ‘కు తెలిపారు. అయితే ఈ విషయంపై తాను తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తానింక ఎవరితోనూ చర్చించలేదని, అందరితో మాట్లాడిన తరువాతే ఓ నిర్ణయానికి వస్తానని వివరించారు. టీఆర్ఎస్ లో చేరాలన్న డెసిషన్ మాత్రం ఇంకా తీసుకోలేదని తెలిపారు.

Tags:    

Similar News